తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి పాత్ర ఎంతంటే?

by Ravi |   ( Updated:2022-09-12 18:30:59.0  )
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి పాత్ర ఎంతంటే?
X

కేసీఆర్ అంకుఠిత దీక్ష, ప్రొఫెసర్ కోదండరామ్, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరుల పట్టుదల, ఉద్యమకారుల పోరాటం, సకల సంఘాల సహకారం, సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీల కృషి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడితో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్‌గా మీరాకుమార్ ఉన్నపుడు బిల్లును సభ ఆమోదించింది. దీంతో తెలంగాణ ఏర్పడింది. కార్మిక సంఘాల నేతలు, సింగరేణి జాక్, అన్నింటికీ మించి ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్మిక కుటుంబ సభ్యులు అందరికీ అభినందనలు. ప్రభుత్వ మాజీ విప్ నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, సీపీఐ మాజీ ఎమ్మెల్యే, దివంగత గుండా మల్లేశన్న, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామితో పాటు వేలాది మంది యూనియన్ లీడర్ల మీద కేసులు పెట్టారు. జైలుకు పంపించారు.

తెలంగాణ సాధన కోసం సింగరేణిలో సుదీర్ఘ కాలం సమ్మె జరిగి దశాబ్ద కాలం పూర్తి అయింది. తెలంగాణ సాధనలో సింగరేణీయులది అద్భుత పాత్ర. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో కూడుకున్న జీవితం నల్లసూర్యులది. దేశం మొత్తంలో కరెంటు ఉత్పత్తి కోసం వినియోగించే రాక్షసి బొగ్గును తమ రక్తాన్ని చెమటగా మార్చి బయటకు తీస్తున్న సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెకు మార్గదర్శకులుగా నిలిచారు. అలాంటి చారిత్రక సకల జనుల సమ్మెకు నేటితో (సెప్టెంబర్-13) పదేళ్లు నిండుతున్నయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డలందరినీ స్మరించుకుందాం. వారు తెలంగాణ ప్రజల గుండెలలో చిరస్మరణీయంగా ఉండిపోతారు.

2013 సెప్టెంబర్ 13 నుంచి 35 రోజుల పాటు సకల జనుల సమ్మె సింగరేణి వ్యాపితంగా జరిగింది. సమ్మెను విరమించాలని ఉద్యమ నేత కేసీఆర్‌కు, జాక్ చైర్మన్ కోదండరామ్‌కు, సింగరేణి జాక్, కార్మిక సంఘాలకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే, సింగరేణి కార్మికుల సమ్మె సెగ ఢిల్లీ సమీపంలోని నోయిడా సహా, సౌత్ ఇండియా మొత్తానికి తాకింది మేమంతా కలిసి ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద ధర్నాలోనూ పాల్గొన్నాం. సింగరేణి సమ్మెతో కరెంటు విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. దాదాపు నాలుగు వేల పరిశ్రమలు మూత పడే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఇతర రంగాల వారూ సమ్మె చేసినప్పటికీ, సింగరేణి, ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కువగా పడింది.

తక్షణం స్పందించి

ఒక రాజకీయ డిమాండ్ అయిన 'తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు' కోసం, దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కార్మికులు 35 రోజుల సుదీర్ఘ సమ్మెలో పాల్గొనడం చరిత్రాత్మకమే. వాస్తవానికి కేసీఆర్ ఆమరణ దీక్ష సందర్భంగా ఆయన అరెస్ట్‌కు నిరసనగా సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా స్పందించారు. విధులు బహిష్కరించారు. సమ్మెకు దిగారు. శ్రీకాంతాచారి ఆత్మహత్య సందర్భంగా నల్ల నేల తల్లడిల్లిపోయింది. కార్మికులు విధులు బహిష్కరించి తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ పర్యటన సందర్భంగా రెండు రోజులు సమ్మె చేసి తెలంగాణ డిమాండ్‌ను దేశమంతా తెలిసే విధంగా గర్జించారు. సకల జనుల సమ్మెకు ముందే సింగరేణిలో పలు సందర్భాలలో ఏడు రోజుల పాటు సమ్మె చేసిన చరిత్ర ఉంది.

సకల జనుల సమ్మెతో కలుపుకొని తెలంగాణ రాష్ట్రం కోసం 42 రోజులు సమ్మె చేశారు నల్ల సూర్యులు. అధికారులు కూడా కార్మికుల వెంట నడిచారు. ఉద్యమంలో పాల్గొన్నారు. మద్దతు ఇచ్చారు. ప్రస్తుత సీఎంఓ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగరావు సకల జనుల సమ్మె ముగించిన రోజున సింగరేణికి సీఎండీగా ఉన్నారు. సింగరేణి జాక్, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు రూ. 25 వేల రికవరబుల్ అడ్వాన్స్ ఇవ్వడానికి అంగీకరించి పేమెంట్ చేశారు. సుదీర్ఘ కాలం సమ్మెలో ఉండి వేతనాలు కోల్పోయిన కార్మికులకు అడ్వాన్స్ కొంత ఆర్థికంగా వెసలుబాటు కల్పించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సకల జనుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని ఇచ్చిన మాటను అనంతరం కేసీఆర్ నిలుపుకొన్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు.

ఇంకా ఎంతో జరగాలి

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను లోతుగా స్టడీ చేసిన కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కూడా సింగరేణి కార్మికుల పాత్రను పార్లమెంటులో పదేపదే ప్రశంసించారు. కేసీఆర్ అంకుఠిత దీక్ష, ప్రొఫెసర్ కోదండరామ్, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరుల పట్టుదల, ఉద్యమకారుల పోరాటం, సకల సంఘాల సహకారం, సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీల కృషి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడితో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్‌గా మీరాకుమార్ ఉన్నపుడు బిల్లును సభ ఆమోదించింది. దీంతో తెలంగాణ ఏర్పడింది. కార్మిక సంఘాల నేతలు, సింగరేణి జాక్, అన్నింటికీ మించి ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్మిక కుటుంబ సభ్యులు అందరికీ అభినందనలు.

ప్రభుత్వ మాజీ విప్ నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, సీపీఐ మాజీ ఎమ్మెల్యే, దివంగత గుండా మల్లేశన్న, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామితో పాటు వేలాది మంది యూనియన్ లీడర్ల మీద కేసులు పెట్టారు. జైలుకు పంపించారు. లాకప్‌లలో పెట్టారు. కోల్‌బెల్ట్‌లో నిర్బంధాలను అమలు చేశారు. అప్పుడు అధికారంలో ఉండి ఉద్యమకారులను ఇబ్బందుల పాలు చేసిన ఎందరో ఈ రోజు ఎమ్మెల్యేలు గా, మంత్రులుగా ఉండడం నిజమైన ఉద్యమకారులు జీర్ణించుకోలేని విషయం. భూగర్భాన్ని చీల్చుకుంటూ వెళ్లి బొగ్గును ఉత్పత్తి చేస్తున్న కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. వాటి మీద దృష్టి పెట్టాలి. కొత్త గనుల ప్రారంభానికి కృషి జరగాలి. డిపెండెంట్ ఉద్యోగం కార్మికుల ఇన్‌వ్యాలీడేషన్ ద్వారా ఇస్తున్నారు. మనిషికి బదులుగా మనిషికే ఉద్యోగం లభిస్తుంది. కొత్త రిక్రూట్‌మెంట్ స్వల్పంగా ఉంది. నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలి


ఎండీ మునీర్

జర్నలిస్ట్. కాలమిస్ట్

99518 65223

Advertisement

Next Story