- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లా?
ప్రభుత్వం నడిపే ఫ్యాక్టరీల్లో, సంస్థలలో రిజర్వేషన్లు ఇష్టానుసారంగా అమలు చేయవచ్చు. కానీ ప్రైవేటు రంగంలోని ఫ్యాక్టరీలలో పెట్టుబడి, కష్టం, నైపుణ్యం, ఆటుపోట్లు, అన్నీ వ్యక్తిగతమైనవి. ఏ దేశంలోనైనా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఇతోధిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన కార్మిక రూల్స్‌ను ఫ్యాక్టరీ యాజమాన్యాలు అమలు చేయవలసిందే. కార్మిక కుటుంబాలకు విద్యా ,వైద్యం, పెన్షన్ ఇత్యాది సౌకర్యాలను ఫ్యాక్టరీల యాజమాన్యం సమకూర్చవలసిందే. కానీ, మేము పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇచ్చాం కదా, మేము చెప్పిన మావాళ్ళకి మీ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు ఇవ్వాలి అని యాజమాన్యంపై ఒత్తిడి చేసే హక్కు ప్రభుత్వానికి ఉండదు. కర్ణాటక రాష్ట్రంలోని ఫ్యాక్టరీలలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే పనిచేయాలని నిబంధన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య. గతంలో మహారాష్ట్రలో మరాఠీలు మాత్రమే ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలి అని హుకుం జారీ చేసిన శివసేన పార్టీని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. వాస్తవంగా ఇలాంటి పని విషయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కువైట్, సౌదీ ఇలాంటి దేశాలు శాసనాలు చేస్తే, ఆయా దేశాల్లో ఉద్యోగులైన భారతీయుల పరిస్థితి ఏమిటి?
యూటర్న్ తప్పదా?
ప్రజలను కులాల వారీగా, మతాలవారీగా ప్రాంతాలవారీగా, భాషలవారీగా విభజించి, ఓటు బ్యాంకు రాజకీయాలు నడపడంలో కాంగ్రెస్ పార్టీది అందె వేసిన చేయి అంటే అతిశయోక్తి కాదేమో! అమలుకు అసాధ్యమైన ఉచిత హామీలు గుప్పించి, పోయిన సంవత్సరం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. తాజాగా ప్రవేట్ రంగంలో నూరు శాతం రిజర్వేషన్లుసి.డి ఉద్యోగాల విషయంలో కన్నడీయులకు కేటాయించాలంటూ, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం దేశ ప్రజలను ఆశ్చర్యచకితలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ అనాలోచిత నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు నిరసిస్తూ, ప్రింట్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంతో, ఈ విషయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రైవేట్‌లో అన్నీ వ్యక్తిగతమైనవే
వాస్తవంగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయడానికి తగినంత ధనం ఖజానాలో లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఉచిత హామీలకు కొంత కోత విధించక తప్పడం లేదు. ఈ విషయంలో ప్రజల నుండి వ్యతిరేక వస్తుందనే ఉద్దేశంతో కొత్త పల్లవి తో రాష్ట్రంలోని ఫ్యాక్టరీల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలన్నీ కన్నడీలకు కేటాయించాలని నిర్ణయాన్ని తెరమీదకి తెచ్చింది. వాస్తవంగా ఇది అమలుకు అసాధ్యమైన పని అని కాంగ్రెసులో ఉండే మేధావులకు తెలుసు. కానీ ప్రజలను మభ్య పెట్టాలిగా! ప్రభుత్వం నడిపే ఫ్యాక్టరీల్లో, సంస్థలలో రిజర్వేషన్లు ఇష్టానుసారంగా అమలు చేయవచ్చు. కానీ ప్రైవేటు రంగంలోని ఫ్యాక్టరీలలో పెట్టుబడి, కష్టం, నైపుణ్యం, ఆటుపోట్లు, అన్నీ వ్యక్తిగతమైనవి.
ఓటు బ్యాంకు రాజకీయాలతో తిరోగమనం
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'ఇండియా' కూటమి దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసే ఉచిత హామీలను ఎన్నికల అజెండాలో పెట్టింది. కానీ, స్వదేశీయులు, విదేశీయులు ఎన్నో కుట్రలు పన్నినా ఎన్డీఏ కూటమి మూడోసారి ఘనవిజయం సాధించి, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందుత్వవాదమే వాస్తవిక జాతీయవాదంగా స్వీకరించిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి రావడం మామూలు విషయం కాదు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉచిత హామీలు ఇచ్చినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మూడోసారి తిరస్కరించారు. దేశ అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలతో దేశ ప్రజల ముందుకెళ్తే భవిష్యత్తు ఎన్నికల్లో నైనా విఫక్షాలు విజయం సాధించే అవకాశం ఉంది. అసంబద్ధమైన, అసాధ్యమైన, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ఉచిత పథకాల హామీలతో కాదు.
ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు,
94417 37877.