కవి మాట

by Ravi |   ( Updated:2022-09-03 18:27:24.0  )

'నాకు నమ్మకం లేదు. బానిసల్ని అమ్ముకుంటే వేలకి వేలు డబ్బు వస్తుంది. పైసా ఖర్చు లేకుండా పొద్దస్తమానం ఎద్దులా చాకిరీ చేయించుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని తెల్లవాళ్లు వదులుకుంటారా? అంది ఇరీన్. 'కానీ, ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది' అన్నాడు టామ్. 'మనం పని చేసే ఈ రాష్ట్రంలో వాళ్ళు లేరు గదా?' అన్నాడు వర్జిన్. అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక లక్షలాది నిగ్గర్ల గుడిసెల్లో ఇదే చర్చ పదేపదే సాగింది. తెల్లవాళ్ల బంగళాల్లో ఉత్తరాది తెల్లవాళ్ల మీద ఉక్రోషం, కసి పెరిగింది. బానిసత్వానికి వ్యతిరేకులైన ఉత్తరాది తెల్లవాళ్లకి 'యాం కీ' లని పేరు పెట్టారు. క్రిస్మస్ వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరం వచ్చింది. ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఆ యేడు ఏ వేడుకలూ లేవు. సరదాగా గడపాల్సిన జనవరి ఒకటి సంతాప దినంలా గడిచిపోయింది.

(ఎలెక్స్ హేలీ- 'రూట్స్' నుంచి)

(తెలుగు: సహవాసి- 'ఏడు తరాలు')

Advertisement

Next Story

Most Viewed