శోభకృత... శోభాలంకృతి

by Ravi |   ( Updated:2023-03-21 18:31:05.0  )
శోభకృత... శోభాలంకృతి
X

శోభకృతునకు స్వాగతం

శుభ ప్రదాతకు సుస్వాగతం

మా కలలకు ఆకృతి నీయ,

మా వెతలకు పరిష్కృతి చూప,

మా ఆశల సఫలీకృతము సేయ

మా భవితకు శోభాలంకృతిగా

సాక్షాత్కరించిన బహుమతిగా

అరుదెంచిన శోభకృతునకు

మనస్పూర్వక నమస్కృతులివే

మంగళకర జయధ్వానాలివే

శోభకృత వత్సరమంతా

వసంత ఋతువై సాగాలి

ప్రకృతి మాత కటాక్షంతో

సంక్షేమం విరబూయాలి

జనులంతా ఏకీకృతమై

మమతా శిఖరంగా ఎదగాలి

మానవతకు అనుకృతిగా

మన సంస్కృతి పరిమళించాలి

ఘన చరితను రచించాలి.

- డా. డి.వి.జి.శంకర రావు

94408 36931

Advertisement

Next Story

Most Viewed