- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పిడికెడు మట్టి
ఈ మట్టి కథనే వేరు
ఇక్కడి చెట్ల గాలి కూడా గొంతు విప్పి
పోరుపాటందుకుంటది.
ఈ మట్టికి చరిత్ర ఉన్నదనేది పాత మాట
అసలు ఈ నేలంటేనే
చరిత్ర కాయిదాలపై
పాతేయబడ్డ ఉక్కు స్తంభం కదా..
సాయుధ పోరాటమైన
స్వాతంత్ర్య రణతంత్రమైన
పోరేదైనగానీ
యుద్ధ భూమిలో పొడిసిన
పోరుబిడ్డలే ఈ మట్టి బిడ్డలు.
ఈ మట్టిపై
ఏ పాదం కాలుమోపిన
జీవిత కాలమంతా గుర్తుపెట్టుకునే
మహిమ గలది.
ఈ మట్టిపై నాగలిని మోపి
నాల్గు ఇత్తులను చల్లితే
పల్లె ఆకలి తీర్చే
అమ్మలాంటి చేయి ఈ మన్నులోగలదు.
ముంగిలిలో కూసున్న ముసలోడిని
పల్కరించిన
మున్నూటరవై కథలు
ఇన్నూట ఇరవై శాస్త్రాలను దోసిట్లో ధారబోస్తడు.
ఈ మట్టిలో ఏదో మహత్తరమైన వాద్యం
నాటినట్లున్నారు
లేకపోతే ఏ యలమందను
తడిమిన అలుపురాని
రేలపాటలెలా జాలువారుతాయి.
ఈ మట్టికి సంగీతమంటే ప్రాణమే
కల్లుగేర్ల కాసింత సేపు సేదదీరిన
చెవ్వారా పల్లెసుద్దుల పద్యం గొంతెత్తుకుంటది.
ఈ మట్టిని పిడికిట తీసుకొని
నుదుట దిద్దుకుంటే
మేధావులైతారనీ
జరిగిన చరిత్రను
ఇక్కడ ఒక కవి రాస్తున్నాడు...
అవని శ్రీ
9985419424
- Tags
- poem