అధికారులపై దురుసు ప్రవర్తనా?

by Ravi |   ( Updated:2023-01-28 02:31:44.0  )
అధికారులపై దురుసు ప్రవర్తనా?
X

ప్రభుత్వ పాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరు ఎంతో ముఖ్యం. ఇరువురి సమన్వయంతోనే ప్రజా సమస్యలు, సర్కారు అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. అయితే అక్కడక్కడ వీరి సమన్వయ లోపంతో అధికారులపై ప్రజాప్రతినిధులు దురుసుగా ప్రవర్తిస్తూ అవమానిస్తున్నారు. అందులో ఎక్కువగా మహిళా ప్రజా ప్రతినిధుల భర్తలు ఉండడం గమనార్హం. దీనికి గణతంత్ర దినోత్సవం రోజున కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిషత్తు కార్యాలయంలో ఏఈ తిరుపతిపై ఎంపీపీ సులోచన భర్త శ్రీనివాస్ రెడ్డి దురుసుగా ప్రవర్తించి నీటిసీసా విసరడమే నిదర్శనం.

పీహెచ్‌సీ నిర్మాణ భూమిపూజ గురించి ఏఈని ఎంపీపీ భర్త అడిగే హక్కు ఎక్కడిది?. ఇది అధికార పార్టీ ప్రజాప్రతిధుల దురహంకారంగా భావించవచ్చు. అధికారులు తమ స్థాయిని మరచి చిల్లరగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంత వరకు సమంజసం. వారి పట్ల ఇంత దురుసు ప్రవర్తన అవసరమా? అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దూషించిన సామాన్యులపై కేసులు మోపుతున్నారు. మరి ప్రజా ప్రతినిధులపై చర్యలు ఎందుకు తీసుకోరు? ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

- తలారి గణేష్

9948026058

Also Read...

ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ప్రయోజనమెవరికీ..?


Advertisement

Next Story