- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళాత్మక సజీవ చిత్రణ 'మూన్ లైట్'
ఇవ్వాళ తెలుగు చిత్రసీమ మొత్తంగా ఆస్కార్ వైపు చూస్తోంది. నాటు నాటు పాట ఆస్కార్ బరిలో నిలబడడంతో అందరి ఆసక్తి ఆటు వైపునకే వుంది. RRR సినిమా గురించి, నాటు నాటు పాటకు సంబంధించి చర్చలు, వివాదాలూ ఎన్ని వున్నా, ఎట్లా వున్నా తెలుగు పాట ఆస్కార్‌కు వెళ్ళడంతో సర్వత్రా సంతోషం పెల్లుబుతున్నది. అంతే కాకుండా సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ రావడం దానికి అదనపు ఆకర్షణ. అయితే గతంలో ఏ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో గుల్జార్ రాసిన జయహో.. పాటకు ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు పాటల్ని వాటి స్థాయినీ ప్రభావం గురించిన చర్చ కూడా జరుగుతున్నది. ఈ మొత్తం ఆస్కార్ నేపథ్యంలో 2016లో ఆస్కార్ అవార్డుల్లో వీర విహారం చేసిన 'మూన్ లైట్' సినిమా గురించి తెలుసుకోవాల్సి వుంది. ఎంతో నేర్చుకోవాల్సి వుంది
వసూళ్లు తక్కువైన ఆస్కార్ విజేత
'చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు' అన్న కవితాత్మక వాక్యం 'మూన్ లైట్'. ఇదే సినిమాకి ఊపిరి. వర్తమాన సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక శారీరక ఉద్వేగభరిత స్థితికి ఈ సినిమా అద్దం పడుతుంది. యువత అంటే అదీ అమెరికాలోని నల్లజాతి యువత ఎదుర్కొంటున్న శారీరక, లింగత్వ సమస్యలూ, స్వలింగ సమస్యలూ, ఒంటరితనాలూ అవమానాలూ అన్నీ మూన్‌లైట్ లో చాలా గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమా ఇటీవలే ఉత్తమ సినిమాగా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఆస్కార్ చరిత్రలో మొత్తం నల్లజాతి నటీనటులు నటించిన చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోవడం ఇది మొదటిసారి. అంతేకాదు మొదటి స్వలింగ సంపర్గం ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా అతి తక్కువ బాక్స్‌ఆఫీస్ వసూళ్ళు సాధించింది. అయినా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డును అందుకుని చరిత్ర సృష్టించింది. అలాగే ఈ సినిమా ఎడిటింగ్ విభాగంలోనూ అవార్డ్ గెలుచుకుంది. జోయ్ మాక్ మిల్లన్ మొదటి నల్లజాతి కళాకారుడిగానూ, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మహెర్షల ఆలీ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి ముస్లింగా చరిత్రకెక్కాడు. అవార్డుల సంగతి ఎలా ఉన్నా మూన్‌లైట్ సినిమా ఇతివృత్త స్వీకరణలోనూ, చిత్రీకరణలోనూ, నటీనటుల నటనపరంగానూ అద్భుతమయిన స్థాయిని అందుకుని గొప్ప సినిమాగా నిలిచింది. ఈ సినిమా నిండా జ్ఞాపకాలు, వాస్తవాలూ, ఒకదాని వెంట ఒకటి ముప్పిరిగొని ప్రేక్షకుల్ని చిత్రమయిన స్థితికి త్తీసుకెళ్తాయి.
టారేల్ ఆల్విన్ మాక్ కాన్రే రాసిన ఆత్మ కథను దర్శకుడు బ్యారి జెంకిన్స్ అనుసరించి మూన్‌లైట్ నిర్మించాడు. ఆ ఆత్మకథ పేరే 'చంద్రుడి కాంతిలో నల్లజాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు'. ఆ ఇతివృత్తాన్ని మోడు విభాగాలుగా ఈ చిత్రంలో చూపిస్తాడు దర్శకుడు. లిటిల్, చిరాన్, బ్లాక్‌లు మూడూ ఒక దానికొకటి విడిగానూ, కలిసిపోయినట్టుగానూ, కొనసాగింపుగానూ కనిపిస్తాయి. లిటిల్ బాల్యాన్ని చూపిస్తే, చిరాన్ టీన్ ఏజ్ స్థితిని, బ్లాక్ ఎదిగిన స్థితిని చూపిస్తాయి. ఈ మూడు స్థాయిల్లో నల్లజాతీయుడి గానూ, గే గానూ ఆ యువకుడు ఎదుర్కొన్న సంఘటనల్నీ, సమస్యల్నీ అత్యంత వాస్తవంగానూ, హృద్యంగానూ దర్శకుడు చిత్రీకరించాడు. మూడు స్థాయిల్లో ముగ్గురు నటులతో నటింపజేసి వారి మధ్య ఒక సంలీనత సాధించారు.
చిత్ర కథ..
చిత్ర కథ విషయానికి వస్తే లిటిల్ మియామిలో డ్రగ్ డీలర్ జువాన్‌కు చిరాన్ దొరుకుతాడు. జువాన్ భార్యతో కాకుండా తన ప్రియురాలితో వుంటాడు. చిరాన్‌ని తనతోనే వుండమంటాడు. చిరాన్ తల్లి పవులా డ్రగ్‌కు బానిస అవుతుంది. తన తల్లి పావులాను చిరాన్ ఏవగించుకుంటాడు. చిరాన్‌కు రకరకాల కలలు వస్తాయి. ఇంతలో మిత్రులతో గొడవపడతాడు. వాళ్ళు బ్లాక్ అనే నిక్‌నేమ్ పెడతారు. ఇంతలో తనలో కలుగుతున్న మార్పులు గమనిస్తాడు. ఒక రోజు మిత్రుడు కెవిన్ సముద్రపు ఒడ్డున అతన్ని సంతృప్తి పరుస్తాడు. ఇలా పలు సంఘటనల తర్వాత చిరాన్ ఒకరోజు తనపైన శారీరకంగా దాడి చేసిన కెవిన్‌ను కోపంతో కుర్చీతో కొడతాడు. పోలీసులొచ్చి అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. జైలు జీవితం గడిపిన చిరాన్ శారీరకంగా ఎదిగి మంచి దృఢమయిన శరీరాకృతితో బ్లాక్‌గా బయటకు వస్తాడు. డ్రగ్స్‌కు బానిస అయిన తల్లి అనేక టెలిఫోన్ కాల్స్ చేసింతర్వాత కలవడానికి వెళ్తాడు. తల్లి పశ్చాతాపాన్ని చూసి ఆమెను క్షమిస్తాడు.
మియామికి చేరుకున్న బ్లాక్ తన పాత మిత్రుడు కెవిన్‌ని కలుస్తాడు. కుక్‌గాను, బేరర్‌గాను పనిచేస్తున్న కెవిన్ తనకు పెళ్ళయి ఒక కొడుకున్నాడని కానీ భార్యతో పొసగడం లేదని చెబుతాడు. తాను కోరుకున్నట్టుగా జీవితం కొనసాగకున్నా సంతోషంగానే ఉన్నట్లు చెబుతాడు. ఆ రోజు సముద్రతీరంలో నీతో తప్ప తాను ఇంతవరకు మరెవరితోనూ ఇంటిమేట్ అవ్వలేదంటాడు బ్లాక్. కెవిన్ బ్లాక్‌ని ఓదారుస్తాడు. సముద్ర తీరంలో తన చిన్న తనాన్ని గుర్తు చేసుకుంటూ బ్లాక్ కెమెరాకు అభిముఖంగా తిరిగి చూస్తుండగా సినిమా ముగుస్తుంది. టూకీగా కథ ఇట్లున్నప్పటికీ లిటిల్, చిరాన్, బ్లాక్ మూడు వయసుల్లో భిన్న స్థాయిలో అతడు ఎదుర్కొన్న మానసిక, శారీరక సంఘర్షణ అతలాకుతలం చేస్తుంది. మానవీయ ఉద్వేగాలకు, అనుభవాలకూ, సంఘర్షణలకూ దృశ్య రూపమిస్తుందీ సినిమా.
ఈ సినిమాలో జేమ్స్ లాక్ట్స్‌న్(james laxton) కెమెరా పనితనం ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు 'నేను ఎన్నోసార్లు ఏడ్చాను, మరెన్నోసార్లు కన్నీటి చుక్కలై రాలాను' లాంటి సంభాషణలతో కొన్ని చోట్ల మాటలు ఉద్వేగానికి గురి చేస్తాయి.
ఎలాంటి స్టార్ వాల్యూ, గ్రాఫిక్స్, మిరుమిట్లు గొలిపే దృశ్యాలు ఏవీ లేని మూన్ లైట్ కేవలం ఒక జాతి యువకుడు బాల్యం నుంచీ ఎదుర్కొన్న ఒంటరితనాన్ని, అణచివేతనీ, దుఖాన్నీ అత్యంత వాస్తవికంగా, కళాత్మకంగా ఆయా స్థల కాలాల నేపథ్యంలో దర్శకుడు తీసి నిలబెట్టాడు. కనుకే అందరూ నల్లవాళ్లయినా, నల్లవాళ్ళ కథ అయినప్పటికీ విశ్వజనీనత, చిత్రీకరణకి కళాత్మకత, నటులకు సాధికారకత వున్నప్పుడు ఆస్కార్‌కు నామినేట్ అవడమే కాదు అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ సపోర్టింగ్ ఆలీ, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డుతో పాటు, పలు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్ని అందుకుని మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ బార్రి జెంకిన్స్.
సినిమా: మూన్‌లైట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బార్రి జెంకిన్స్
వారాల ఆనంద్
94405 01281
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
ఎస్సీ, ఎస్టీలకు పథకాల కోత తగునా?