- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్భుత దృశ్య కావ్యం ‘గీతాంజలి’
మణిరత్నం దర్శకత్వంలో 1989లో విడుదలైన ‘గీతాంజలి’ చలన చిత్రం తెలుగులో ఒక ఆణిముత్యంగా నిలిచింది. అంతవరకూ కవిత్వాన్ని చదవడమే జనానికి తెలుసు. నాగార్జున, గిరిజల నటన, లయరాజు ఇళయరాజా స్వరాల సంపద పొదువుకున్న వేటూరి పదాలు అందమైన గీత కావ్యాలు కాగా ఛాయా గ్రాహకునికి చిక్కిన ఊటీ అందాలు మణిరత్నం దార్శనిక దర్పణంలో ద్విగుణీకృతమైన దృశ్యాలు వెరసి గీతాంజలిని దృశ్యకావ్యంగా మార్చేశాయి. నాగార్జున ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ చేశారు. అలా చేయడం ఆ రోజుల్లో ఒక సాహసం అని చెప్పాలి. ఇక హీరోయిన్ కోసం సాగిన అన్వేషణలో గిరిజ ఈ సినిమా కోసమే పుట్టిందనట్టుగా సరిపోయింది. ఆ తర్వాత ఆమె పెద్దగా నటించకపోయినా గిరిజకు తెలుగునాట ఇప్పటికీ ప్రేక్షకాదరణ ఉందంటే దానికి గీతాంజలే కారణం. ఈ సినిమా 1989 మే 19వ తేదీన విడుదలైంది.
కథ వెనుక మథనం
తాను ఒక కథను తయారు చేసుకుని, ఆ కథలోని పాత్రలను బట్టే నటీనటులను ఎంచుకుంటూ ఉంటారు మణిరత్నం. ఇందులోని నాయకుడి పాత్రకి నాగార్జునను తీసుకున్నారు. మణిరత్నం వంటి దర్శకుడు చెప్పడంతో నాగార్జున సైతం కాదనలేకపోయాడు . ఇక ఫారిన్ నుంచి సెలవులకి ఇండియా వచ్చిన 'గిరిజ' అనుకోకుండా ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మణిరత్నం, సుహాసినిల పెళ్లి వేడుకలో హాజరైన క్రికెటర్ శ్రీకాంత్ కుటుంబంతో వచ్చిన ఓ అమ్మాయి బావుందని మణిరత్నంకు అనిపించడంతో ఆమెను సంప్రదించి ఓకే చేయించుకున్నారు. ఆమే హీరోయిన్ గిరిజ. తనకేమో తెలుగు రాదు. అందుకని సీనియర్ అసోసియేట్ డైరెక్టర్‌తో డైలాగ్స్ పలకడంలో ట్రైనింగ్ ఇప్పించారు మణిరత్నం. ఆమె పాత్రకు తెలుగులో మరో నటితో డబ్బింగ్ చెప్పించారు మణిరత్నం. ఆ నటి ఎవరో కాదు రోహిణి. నటుడు రఘువరన్ సతీమణి అయినా రోహిణి. ఇలా నటీనటులను ఎంచుకొని షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలైన ఈ సినిమా,
బయ్యర్లు అంచనాలను తలకిందులు చేసి కాసుల వర్షాన్ని కురిపించి ఎప్పటికీ చెరిగిపోని ఒక క్లాసిక్ గానే మిగిలిపోయింది. విడుదలకు ముందు ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు వెనకడుగు వేశారు. హీరో, హీరోయిన్ ఇద్దరూ చనిపోతారా? ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా, ఇలాంటి క్లైమాక్స్‌ను అంగీకరిస్తారా? అని ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నిర్మాత సీఎల్ నరసారెడ్డి ఈ సినిమాను స్వయంగా విడుదల చేశారు. 4 వారాల పాటు థియేటర్లలోనే ఉంచి చూశారు. ఆయన ఆశించినట్లుగానే 4వ వారం నుంచి జనంలో కదలిక మొదలైంది. ఈ సినిమా గురించి మాట్లాడుకోవటంతో జనాలు థియేటర్ల బాటపట్టారు. ఇక అక్కడి నుంచి ఈ సినిమా టిక్కెట్లు దొరకడం కూడా కష్టమైపోయింది. ఈ సినిమాలోని ప్రతి పాట హిట్.. ప్రతి దృశ్యం అద్భుతం. ఈ సినిమాకి ఇదే సరైన క్లైమాక్స్ అని ఒప్పుకున్నారు. మణిరత్నం సినిమాల్లో ఇది మణిపూస అన్నారు .. ఇళయరాజా చేసిన గొప్ప ఆల్బమ్స్ లో ఇది ఒకటి అని చెప్పుకున్నారు. ఈ సినిమాలో గిరిజ ధరించిన డ్రెస్‌లు ‘గీతాంజలి డ్రెస్‌లు’గా పాప్యులర్ అయ్యాయి. సాధారణంగా హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయితే ఆ వెంటనే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతుంటారు. కానీ గిరిజ మాత్రం ఆ తరువాత సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపకుండా తిరిగి విదేశాలకి వెళ్లి పోయింది.
హీరోయిన్ పాత్ర రియల్ క్యారెక్టర్!
ఈ గీతాంజలి సినిమాను తీయడానికి స్ఫూర్తి ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల గీతాంజలి అనే అమ్మాయి కారణమంటారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ అమ్మాయి తన భావాలన్నీ డైరీలో రాసి పుస్తకంగా వెలువరించింది. ఆ పుస్తకం చదివిన మణిరత్నం బాగా చలించిపోయి, ఈ సినిమా తీయాలని నిర్ణయించుకుని ఆ రియల్ క్యారెక్టర్ పేరునే సినిమా పేరుగా ఫిక్స్ చేసి ఆ కథను తనదైన స్టైల్లో తెరకెక్కించారు మణిరత్నం. ఈ సినిమా, మరికొన్ని నెలలకు మించి తాము బ్రతకమని తెలిసిన ఇద్దరు ప్రేమికుల కథ.
గీతాంజలి సినిమాలో గీతాంజలిగా చేసిన గిరిజ ఒట్టి అల్లరి పిల్ల. చనిపోతానని తెలిసినా మృత్యువు ఎదురైతే దానినీ అల్లరి పెడదామని చూసే పిల్ల. ప్రకాష్ పాత్ర పోషించిన నాగార్జున కూడా కొంటె పిల్లాడేకాని హాఠాత్తుగా మృత్యువు తనని కౌగిలించుకోవడానికి వస్తుందని తెలిసేసరికి కొంచెం డిస్టర్బ్ అవుతాడు. తను కన్నీరు కారుస్తుంటే ఈ అమ్మాయి చిన్నచిన్న సంతోషాలను వెతుక్కుంటూ ఆనందబాష్పాలు రాలుస్తోంది. ఈ అమ్మాయికి ప్రకృతిలో ప్రతి క్షణం ఒక జన్మ. అందమైన జన్మ. దీంతో ఆ యువకుడికి ధైర్యం వస్తుంది. జీవితం పట్ల అవగాహన ఏర్పడుతుంది. రేపటి చింత ఇవాళ ఎందుకు ఈ క్షణాన్ని ఆనందంగా గడుపుదాం అని ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయీ అతడితో మనస్ఫూర్తిగా ప్రేమలో పడింది. మృత్యువు దాకా వెళ్లి తిరిగి వచ్చాక అతడి కోసం వెతుకుతుంది. ఆమె నుంచి దూరంగా పోదామనుకున్న అతడు కూడా ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె చేయి పట్టుకుంటాడు.‘ఎంతకాలం బతుకుతారో తెలియదు. కాని బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు’ అని స్క్రీన్ మీద పడటంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా తెరకెక్కింది.
వేటూరి శబ్ద శాసనం!
అష్టాయ ఫట్ ఫట్ ఫట్ ‘మసజసతతగ శార్దూల’ కాదేది పాట కనర్హం అని చాటిన గేయ రచయిత వేటూరి. యతులు, గణాలు, చందస్సు, ఆయన పాటల్లో పాదాలుగా ఒదిగిపోతాయి. ఈ సినిమాలో వేటూరి రాసిన సాహిత్యానికి ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే ఆరు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఒంటరి బాటసారీ జంటకు చేరగా చిరు చేపల కనుపాప అల్లరి పాపాయిగా మారిపోగా వయస్సులో వసంతమె ఉషస్సులా జ్వలిస్తే వారి ఇరువురి మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక జాలి మాటలు మాసిపోని ఆశలు అయినా వాటిని లెక్క చేయక జగతికే..అతిథులై జననమందిన ప్రేమ జంట ఆ నయన శృతులకు హృదయ లయలు ప్రేక్షకులకు మరో ప్రపంచాన్ని మరింత చేరువ చేశాయి. గనాలు భువనాలు ప్రేమతో వెలిగించేసి మరణాన్ని ప్రేమతో పిలిచి నిధికన్నా ఎదమిన్న ప్రేమకే జయం ప్రేమదే జయం ఆర్థిక కష్టమో, ఆరోగ్య కష్టమో, జీవిత కష్టమో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక్క చిరునవ్వుతో దానిని ఎదుర్కొనడానికి సిద్ధపడితే జీవితం సులువవుతుంది చెప్పే ఈ సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులకు నైరాశ్యంలో ఉన్నవారికి చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యాయత్నానికి దిగే నేటి యువతకు స్ఫూర్తి.
శ్రీధర్ వాడవల్లి
9989855445