- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మద్యం షాపులు బంద్ చేయాలి!
దేశానికి స్వాతంత్రం రావడానికి కూడా అనేక పోరాటాలు, ఎందరో మహాత్ముల త్యాగాలు సిద్ధిస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ అమరుల జ్ఞాపకార్థం, భారతావనికి స్వాతంత్రం సిద్ధించిన శుభసూచికంగా ఆగస్టు 15వ తేదీన, జనవరి 26వ తేదీన మద్యం దుకాణాలు మూసివేస్తారు. అలానే వేలాది తెలంగాణ ప్రజల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ రోజున అమరులైన త్యాగాలను జ్ఞాపకం చేసుకునే విధంగా.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం వచ్చినా సరే.. పాఠశాలల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలకు బ్రిటిష్ వారి నుంచి భారతదేశాన్ని ఎలా సాధించుకున్నది, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన తెలంగాణ యోధుల పోరాటపటిమల గురించి.. ప్రాణత్యాగాలు చేసిన అమరులైన యోధుల చరిత్రను తెలిసేలా చేసినప్పుడే నూతన నవనిర్మాణ తెలంగాణగా మార్చడానికి అవకాశం ఉంటుంది. భావితరాలకు తెలంగాణ గొప్పతనం గురించి తెలుస్తుంది. గత ప్రభుత్వానికి అనేక రకాలుగా దీని గురించి తెలియజేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వమైనా స్పందించి తెలంగాణ అమర వీరుల త్యాగాలకు విలువ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
-వై. సంజీవ కుమార్,
స్కై ఫౌండేషన్
93936 13555