రైతు సంక్షేమంకోసం జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-21 13:24:50.0  )
రైతు సంక్షేమంకోసం జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
X

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో రైతులు నిశ్చింతగా జీవిస్తున్నారు. రైతులపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, వారి కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతగానో మేలు చేస్తున్నాయి. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల కింద ఇప్పటివరకు రైతుల కోసం రూ.1 లక్షా 33 వేల 524 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను స్పష్టం చేసింది.

ఎప్పుడూ వైఎస్ఆర్‌సీపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పాలన సమయంలో ఆయన రైతులకు పెద్దగా చేసిన మేలేది లేదు. ముఖ్యంగా ఆయనకు కరువు సీఎంగా పేరు. ఆయన పాలనలో రైతులు ఎప్పుడూ కరువు కాటకాలతో బాధపడేవారు. ఆయన గతంలో 14 ఏళ్ల పాటు సాగించిన పాలనే అందుకు సాక్ష్యం. టీడీపీ హయాంలో ఐదేళ్ల కాలంలోనే 1,623 మండలాలు కరువును చవిచూశాయి. అదే వైఎస్ఎర్‌సీపీ పాలన చేపట్టాక 2019 నుంచి ఏ ఒక్క మండలాన్ని 'కరువు మండలం'గా ప్రకటించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ

జగన్ సర్కార్ తెచ్చిన ఒక్క 'వైఎస్ఆర్ రైతు భరోసా' పథకం ద్వారానే 50 లక్షలకు పైగా మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ ద్వారా 40 నెలలలో దాదాపు రైతుల ఖాతాలలో రూ.25 వేల 971 కోట్లకు పైగా నేరుగా జమ చేశారు. ఇటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పంట కొనుగోలు, పంటలకు సంబంధించిన సకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. దీంతో రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఆత్మహత్యలు భారీగా తగ్గిపోయాయి. ఇది గత టీడీపీ పాలనతో పోల్చిచూస్తే రైతులకు వైఎస్ఆర్‌సీపీ పాలనలో మూడేళ్లలోనే 167.24 లక్షల టన్నులు ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది.

చంద్రబాబు తన హయాంలో రైతులకు వడ్డీలేని రుణాల పేరుతో కేవలం రూ.685 కోట్లు ఖర్చు చేయగా, జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటికే రూ.1,282 కోట్లు ఖర్చు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం 30.25 లక్షల మంది రైతులకు మాత్రమే రూ.3,411 కోట్ల పంట బీమా అందించి మిగతా వారిని పట్టించుకోలేదు. కానీ, వైఎస్ఆర్‌సీపీ పాలనలో 44.28 లక్షల మంది రైతులకు ఇప్పుడు రూ.66 వేల కోట్ల విలువైన పంట బీమా అందుతోంది. వైఎస్ఆర్‌సీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడని ఇది నిరూపిస్తోంది.


రాజకుమార్

సీనియర్ జర్నలిస్ట్

99632 76947‬

ఇవి కూడా చదవండి :

కొత్త రాజకీయం మొదలెట్టిన Pawan Kalyan.. విశాఖ ఘటన తర్వాత..!!

Advertisement

Next Story