- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిజియోథెరపీ అంటే చిన్న చూపా?
తెలంగాణలో ఫిజియోథెరపీ డాక్టర్ల పరిస్థితి మరీ అద్వానంగా తయారైంది. గత 20 ఏళ్ల నుంచి తెలంగాణలో ఒక్క ఫిజియోథెరపీ పోస్టును కూడా ప్రభుత్వాలు భర్తీ చేయలేకపోయాయి. దీనికి కారణం 2000 సంవత్సరంలో కుష్టు వ్యాధి అంతరించిపోయిందని అందులో పనిచేస్తున్న కొందరు సిబ్బందికి కేవలం ఆరు నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయించి, వారికి ఫిజియోథెరపిస్ట్ సర్టిఫికెట్ ఇచ్చి, వారిని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గెజిటెడ్ ఉద్యోగులుగా నియమించారు. అయితే, వీరి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆ ఫిజియోథెరపీ పోస్టులను భర్తీ చేయలేకపోయింది. కారణం, అప్పటికే లెప్రసీ విభాగం నుంచి వచ్చిన వాళ్లు ఫిజియోథెరపిస్టులుగా చెలామణిలో ఉన్నారు. వాళ్ల స్వలాభం కోసం నాలుగున్నర సంవత్సరాలు చదివి వచ్చిన క్వాలిఫైడ్ డాక్టర్‌లకు స్థానం కల్పిస్తే తాము ఎక్కడ చులకన అయిపోతామో అని వీళ్లను లోనికి రానివ్వలేదు, కొత్తగా పోస్టులను క్రియేట్ చెయ్యనివ్వలేదు.
దాని అవసరం తెలిసొచ్చి..
20 సంవత్సరాల క్రితం ఫిజియోథెరపీ అని అంటే క్షరకులు మసాజ్ చేసే కార్యక్రమం లాంటిది అని అనుకునేవారు. అప్పట్లో పక్షవాతం వచ్చినవారికి మసాజ్ చేయడం వల్ల వాళ్లు నయమవుతారని, అదే మసాజ్‌ను ఫిజియోథెరపిస్టులు కూడా చేస్తారు అనే అపోహ ఉండేది. రాను రాను ఆ అపోహ పోయి అన్ని రకాల ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పుల నివారణ కోసం ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజులు చేయించడం, కరెంటు పరికరాలు ఉపయోగించడం వల్ల మందులతో నయం కానీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నాణ్యమైన చికిత్సను అందిస్తున్నాయని ఇప్పుడిప్పుడు అందరికీ తెలిసి వస్తుంది. ఇదివరకు ఆర్థో, న్యూరో డాక్టర్లు ఫిజియోథెరపిస్టుకు పేషెంట్‌ను రిఫర్ చేయాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు జనాలకు అన్ని వ్యాధులకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.
ఫిజియోథెరపీతో బోలెడు మేళ్లు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కండరాల, కీళ్ల నొప్పులకు గురవుతున్నవారే.. వారికి మందులతో నయం కానీ, వ్యాధులు ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజ్‌ల వల్ల నయమవుతాయి. దీని ద్వారా నరాలకు సంబంధించిన పక్షవాతం, నరాల వీక్నెస్, చిన్నపిల్లల్లో వచ్చే అంగవైకల్యం కూడా నయమవుతాయి. ఇంకా కార్డియో ఫిజియోథెరపీ అంటే గుండెకు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో, 2019లో వచ్చిన కరోనా వ్యాధిని తగ్గించడంలో ఈ కార్డియాక్ ఫిజియోథెరపిస్టులు ముందు వరుసలో ఉన్నారు.
ప్రస్తుతం ఇందులోనే..గైనకాలజీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ ఫిజియోథెరపీ వంటి అనేక శాఖలు మొదలయ్యాయి. దీంతో మనిషిని పూర్తిగా నయం చేయడంలో ఎంబిబిఎస్ డాక్టర్లకు ఎంత పని ఉంటుందో అంతకుమించి ఫిజియోథెరపిస్టులు మనిషిని ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో ఎంతో ముఖ్యపాత్ర వహిస్తారు. ఆర్థో, న్యూరో కార్డియో... ఇలా ఏ రకమైన ఆపరేషన్ అయినా కూడా వాళ్లు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపిస్టును సంప్రదించి ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజులు ప్రాక్టీస్ చేయాల్సిందే. క్యాన్సర్ చికిత్స అనంతరం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, అధిక లావు గల వాళ్ళు బరువును తగ్గించు కోవడంలో కూడా ఈ ఎక్సర్‌సైజ్‌లు ఎంతో ఉపయోగపడతాయి.
వారు డాక్టర్లు కారా?
ఫిజియోథెరపిస్టులను డాక్టర్ అనకూడదు అని ఇతర వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు ఎంబీబీఎస్ డాక్టర్ చదివిన అన్ని సబ్జెక్టులను కూడా ఫిజియోథెరపిస్టులు చదువుతున్నారు. మందులతో నయం కానీ దీర్ఘకాలిక రోగాలను ఫిజియోథెరపీ వ్యాయామం వల్ల నయం చేస్తున్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అనేది ఇండియాలో ఉన్న ఫిజియోథెరపీ కోర్సు చేసిన విద్యార్థులకు సంబంధించింది. ఈ అసోసియేషన్ నియమ నిబంధనల ప్రకారం సభ్యత్వం కలిగి ఉన్నట్లయితే వారిని డాక్టర్లుగా పరిగణించవచ్చు అని, వారి పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోవచ్చు అని చెబుతోంది.
ఫిజియోథెరపీ కౌన్సిల్ లేని రాష్ట్రం
తెలంగాణలో ఫిజియోథెరపీ కౌన్సిల్ అనేది లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వతంత్ర ఫిజియోథెరపీ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసుకుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వంలో అటువంటి ఊసే లేదు. దీనికి కారణం సరియైన నాయకత్వం లేకపోవడం, ఫిజియోథెరపిస్టుల మధ్య సమన్వయం లేకపోవడం. మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు ముఖ్యమంత్రి కూడా ఈ ఫిజియోథెరపిస్టుల సేవలను పొందుతున్నారు కానీ ఈ ఫిజియోథెరపిస్టులకు న్యాయం చేయలేక పోతున్నారు.
- డాక్టర్ గోరంట్ల సత్యనారాయణ
సీనియర్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్
98490 09634