- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అగ్రవర్ణ రిజర్వేషన్లు హేతుబద్ధమేనా!
ఓబీసీలలోనూ పేదలు ఉన్నారు కదా? అనడం కరెక్టే కానీ, అంతకు మిక్కిలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మెజార్టీ ప్రజలంతా పేదలే కదా? ఈ దేశంలో ఎక్కువ పేదరికంలో మగ్గిపోతున్నది వారే కదా? అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ నిజమైన పేదలకే కదా అవసరం ఉన్నది? ఇవేమీ పట్టించుకోకుండా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ తమకున్న సంఖ్యాబలంతో బిల్లు ఆమోదింప చేసుకున్నారు. గతంలో మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయొద్దన్నవారు ఈ చట్టం చేయడం కుట్రగానే భావించాలి. దీనికి అన్ని పార్టీలు మద్దతు పలికాయి. వారందరికీ రాజ్యాంగ స్ఫూర్తి అర్థం కాలేదేమోనని, దీనిని నిలిపివేయాలని రాజ్యాంగ నిష్ణాతులుండే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.
శాసనసభలు రూపొందించిన చట్టాలను, న్యాయస్థానం ఇచ్చే తీర్పులను గౌరవించాల్సిందే. అవి అమలులో ఉన్నంతకాలం వాటిని శిరసావహించక తప్పదు. అయితే, వాటిని నిర్ణయించేవారు, తీర్పులిచ్చేవారు మనుషులే కాబట్టి వాటిని పరిశీలించాల్సిన అవసరం, సవరించాలని డిమాండ్ చేసే స్వేచ్ఛను కూడా మనకు రాజ్యాంగం ప్రసాదించిన విషయం మరవరాదు. పరిస్థితులను అర్థం చేసుకొని స్పందించగలిగే మానవీయత కొందరికి మాత్రమే సొంతం. అది జరగాలంటే సమస్య పట్ల స్పష్టత ఉండాలి.
ఆ సమస్య వలన అయ్యే గాయాలు, నష్టాలు స్వతహాగా ఎదుర్కొన్న అనుభవం ఉండాలి. లేదంటే ఆ సమూహాల బాధను అర్థం చేసుకోవడం కష్టం. ఇదంతా ఎందుకంటే ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదలకు కలిపించిన పది శాతం రిజర్వేషన్లు. దీనిని సవాలు చేస్తూ కోర్టులో 40 పిటిషన్లు ఫైలయ్యాయి. వాటి వాదనలు విన్న కోర్టు (Supreme Court judgment on ews reservations) నవంబర్ ఏడున అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ సరైనదే అంటూ తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ మూల సిద్ధాంతానికి విరుద్ధమనే మాట వినబడుతోంది.
వాటికి దూరంగా వేల కులాలవారు
మొదటి రాజ్యాంగ సవరణ ప్రకారం 'వెనుకబడిన వర్గాలు అనేవి కొన్ని కులాల సముదాయం తప్ప మరేమీ కాదని' అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ప్రభుత్వాలు, కోర్టులు మర్చిపోవడం అత్యంత బాధాకరం. రాజ్యాంగ పీఠిక సైతం సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే తన లక్ష్యమని చెబుతోంది కానీ, ఇక్కడి తీర్పులో మాత్రం సాంఘిక అనే పదాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇది రాజ్యాంగానికే పెద్ద ముప్పు. సామాజిక అన్యాయం నుంచి కాపాడేందుకు నిర్దేశించిన article 46ను సైతం పట్టించుకోవడం లేదు. సామాజిక అసమానతలే కాదు, విద్య వైద్య ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అసమానతలు వేళ్లూనుకుని ఉన్న దేశం మనది. ఇక్కడ కులమే వర్గమని 1971లో periyakaruppan vs state of tamil nadu కేసులో సుప్రీంకోర్టు తెలిపింది. కులం ఆధారంగా చదువు, కొలువు, ఆస్తి, అధికారాలు అప్పటిదాకా రిజర్వేషన్లు అందించబడుతున్న కులాలకు నిషేధించబడ్డాయి తదనుగుణంగానే ఆధిపత్య కులాలు సమస్త అధికారాలను, సౌకర్యాలను తమ చేతులలో ఉంచుకున్నాయి. ఫలితంగా అణగారిన కులాలు పీడితులుగా ఉండిపోయాయి. ఇప్పటికీ బడిలో అడుగుపెట్టని కులాలు వందల సంఖ్యలో ఉన్నాయి. చట్టసభలలోకి కాదు కదా, కనీసం స్థానిక సంస్థలలో అడుగుపెట్టని కులాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అందుకే రిజర్వేషన్ అనేది ఓట్ల పథకం కాదు. వందల తరాల ఎస్సీ ఎస్టీ బీసీల వెట్టి చాకిరీకి ఉపశమనం. ఒకవేళ ప్రభుత్వాలు అగ్ర వర్ణాల వారికి ఆర్ధిక వెనుకబాటును సరి జేస్తామనుకుంటే నగదు బదిలీ చేసుకొండి. ఆదాయాన్ని బట్టి రిజర్వేషన్ అందిస్తే ధనికులు పలుకుబడితో దొంగ ఆదాయ సర్టిఫికెట్లు పొందుతారని 'జస్టిస్ చిన్నపరెడ్డి 1990 లో K.C. Vasanth Kumar vs State Of Karnataka కేసులో ఇచ్చిన జడ్జిమెంట్‌ను నెమరువేసుకుంటే అర్థమవుతుంది. అగ్రవర్ణాలవారు పేదవారైనా సామాజికంగా, సాంస్కృతికంగా సమాజంలో ఉన్నతస్థాయిగా గుర్తించబడ్డారు.
Also read: పేరుకే రిజర్వేషన్ కానీ ఆ ఫలాలు వారికందవు! కారణం?
ఓబీసీలలోనూ పేదలు ఉన్నారు కదా? అనడం కరెక్టే కానీ, అంతకు మిక్కిలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మెజార్టీ ప్రజలంతా పేదలే కదా? ఈ దేశంలో ఎక్కువ పేదరికంలో మగ్గిపోతున్నది వారే కదా? అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ నిజమైన పేదలకే కదా అవసరం ఉన్నది? ఇవేమీ పట్టించుకోకుండా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ తమకున్న సంఖ్యాబలంతో బిల్లు ఆమోదింప చేసుకున్నారు. గతంలో మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయొద్దన్నవారు ఈ చట్టం చేయడం కుట్రగానే భావించాలి. దీనికి అన్ని పార్టీలు మద్దతు పలికాయి. వారందరికీ రాజ్యాంగ స్ఫూర్తి అర్థం కాలేదేమోనని, దీనిని నిలిపివేయాలని రాజ్యాంగ నిష్ణాతులుండే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మురళీధర్ రావు కమిషన్ ఆధారంగా రిజ్వర్వేషన్లను 44 శాతం పెంచితే ఇదే supreme court కొట్టివేసింది. వారి జనాభా లెక్కలు, స్పష్టమైన వివరాలు, సమగ్ర నివేదికలు లేవని, రిజర్వేషన్లు 50 శాతానికి మించేది లేదని తేల్చి చెప్పింది. మరి సమగ్ర నివేదిక, వివరాలు లేకున్నా ews reservations మీద ఎలా తీర్పునిచ్చారు? ఇది సహజ న్యాయానికి, సామాజిక న్యాయానికి తూట్లు పొడవడమే. రిజర్వేషన్లకు పరిమితి విధించింది తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం. ఇప్పుడు పెంచాలంటే తొమ్మిది మంది కంటే ఎక్కువ మందితో కూడిన ధర్మాసనమే దానిని విచారించాలి. దేశంలో బహుజన, మైనార్టీ మహిళల ఆశలు నెరవేరాలంటే రాజ్యాంగం ప్రసాదించిన అవకాశాలు పొందాలంటే పూలే, అంబేద్కర్ నిర్ధేశించిన బహుజన రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం.
Also read: ఒకే సమూహంగా ఉన్నా వారికి ఒకే రిజర్వేషన్ లేదా!
చలకాని వెంకట్‌యాదవ్
తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్
98665 89914