- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఎస్ రద్దుకు ప్రెషర్ పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించి సీపీఎస్‌ను రద్దు చేసి ఓటీఎస్ ను పునరుద్ధరించాలి. దీనితో ప్రభుత్వ ఖజానాకు కూడా వేల కోట్లు జమవుతాయి. నెలనెలా రూ.200 కోట్లు చెల్లించనవసరం లేదు. జీపీఎస్ రూపంలో వందల కోట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ తీర్చినట్టూ ఉంటుంది. అన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయుధంగా ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ఉద్యమంలో ఎలాగైతే జేఏసీ ఏర్పాటు చేసారో, అలాగే సమైక్యంగా మరో పోరుకు సిద్ధం కావాలి.
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేయగా, కొన్ని రాష్ట్రాలు రద్దు చేసే ఆలోచనలో ఉన్నామని ప్రకటించాయి. సీపీఎస్‌ను కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు వర్తింపజేసుకున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ కూడా కేంద్రం కోరిన వెంటనే ఇందులో చేరిపోయింది. ప్రారంభంలో పెద్దగా ఈ పెన్షన్ స్కీం గురించి ఉద్యోగులు పట్టించుకోలేదు. కాలం గడుస్తున్న కొద్ది సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య పెరగడంతో దీని వలన వచ్చే నష్టాలను గుర్తించారు. ఉద్యోగ విరమణ పొందాక వస్తున్న పెన్షన్ ఆసరా పెన్షన్ కంటే దారుణంగా ఉండటంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగింది. సీపీఎస్ రద్దుకు డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాల ఒత్తిడి మేరకు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు సీపీఎస్ రద్దు దిశగా అడుగులు వేశాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నూతన ఆర్థిక సంవత్సరం నుంచి ఓపీఎస్‌ను అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 240 మందికి ఓపీఎస్ సౌకర్యం కల్పించారు. ఛత్తీస్‌గఢ్ సీపీఎస్‌ను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసి జీపీఎఫ్ సౌకర్యం కల్పించింది. ఝార్ఖండ్‌లో సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి తెచ్చారు.
పంజాబ్ ముఖ్యమంత్రి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులోనూ రద్దు చేయనున్నారు. మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇదే ప్రధాన అంశంగా ఉంది.
Also read: ఆసరా పెన్షన్ కంటే దారుణంగా ఉద్యోగి పెన్షన్ ఉందా?
వాటిని ఫణంగా పెట్టి
సీపీఎస్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అమలులోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తప్పుకునే అవకాశం ఉన్నా కూడా తెలంగాణ సీపీఎస్ విధానానికి అంగీకరించింది. ఇదే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులకు శాపమైంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల పాత్ర అనిర్వచనీయం. 45 రోజుల పాటు ఉద్యోగాలను ఫణంగా పెట్టి సకల జనుల సమ్మె చేసి ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే అన్ని ఉద్యోగ సంఘాలున్నాయి.
రాష్ట్ర అభివృద్ధిలో శక్తికి మించి పని చేస్తూ అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందువరుసలో నిలుపుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించి సీపీఎస్‌ను రద్దు చేసి ఓటీఎస్ ను పునరుద్ధరించాలి. దీనితో ప్రభుత్వ ఖజానాకు కూడా వేల కోట్లు జమవుతాయి. నెలనెలా రూ.200 కోట్లు చెల్లించనవసరం లేదు. జీపీఎస్ రూపంలో వందల కోట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ తీర్చినట్టూ ఉంటుంది. అన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయుధంగా ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ఉద్యమంలో ఎలాగైతే జేఏసీ ఏర్పాటు చేసారో, అలాగే సమైక్యంగా మరో పోరుకు సిద్ధం కావాలి.
Also read: రాష్ట్ర ప్రభుత్వం టీచర్లపై ఇంత చిన్నచూపు చూస్తోందా?
జుర్రు నారాయణ యాదవ్
టీటీయూ ప్రెసిడెంట్
మహబూబ్‌నగర్
94940 19270