- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమర ప్రేమ కథ ‘లైలా మజ్ను’
చిత్ర సీమలో ప్రేమ కథలు నిత్య నూతన విజయవంత సూత్రం. ఈ నేపథ్యంలో ఎన్నో మూకీ, టాకీలు వచ్చాయి. భగ్న ప్రేమలు విషాదాంత ప్రేమ గాథలు నాడు నేడు కూడా ప్రేక్షకుల మన్ననలనందుకుంటున్నాయి. క్లాసిక్‌గా నిలిచిన చిత్రాలు కూడా ఈ తరహావే కావడం విశేషం. పీరియాడికల్ చిత్రాలు కూడా విఫల ప్రేమ కథలతో గొప్ప సినిమాలుగా నిలిచి, చరిత్ర సృష్టించాయి. ఆనాటి సమాజ, రాచరిక, భావోద్వేగాలను తగిన పాత్ర ఆహార్యంతో సెల్యులాయిడ్ పైన చిత్రించిన దర్శక నిర్మాతల నిబద్ధత హర్షణీయం. దేవదాసు, మల్లీశ్వరి, చిరంజీవులు, ఉప్పెన వరకు ప్రేమ కథలు గొప్ప కమర్షియల్ ఎలిమెంట్‌గా నిర్మాతలకు నిలిచాయనటం అతిశయోక్తి కాదు.
సాంకేతిక నిపుణుల కష్టం..
ఈ కోవకు చెందిన సూత్రం ‘లైలా మజ్ను’. ‘భరణి పిక్చర్స్’ పతాకంపై భానుమతీ రామకృష్ణలు దీనిని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో 1949, 1950 లలో విడుదలై గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘లైలా మజ్ను’. ‘ప్రేమ నేరమవునా..’ అనే గీతం నేటికీ వినిపిస్తూనే ఉంటుంది. అమర కావ్యమైన చిత్రానికి అజరామరమైన సంగీతం అందించిన సి.ఆర్.సుబ్బరామన్ చిరస్మరణీయుడు. ఈ చిత్రంలో వేసిన సెట్స్ నాటి పర్షియన్ వాతావరణాన్ని సజీవంగా తెరపై ఆవిష్కరించిన అంశాలు నాటి ‘హిందూ’ పత్రికలో ప్రచురించారు. కళా దర్శకులుగా పనిచేసిన గోడ్కోంకర్, కే. నాగేశ్వరరావులదే ఆ ఘనతగా చెప్పుకోవాలి. ఛాయాగ్రహణ దర్శకులుగా పనిచేసిన బి.ఎస్. రంగా తనదైన ముద్రను చూపించి స్టూడియోలోనే వేసిన పర్షియన్ వాతావరణన్ని సృష్టించిన సెట్స్‌ను రాత్రి వేళలోనే చిత్రించి దర్శకుడు రామకృష్ణ గారి అంతరంగా నైపుణ్యవంతమైన స్క్రీన్ ప్లే పనితనంను ప్రతిభావంతంగా తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రంతో ఆయన కెరీర్‌ను మలుపు తిప్పినదనే చెప్పాలి. ఆయన ఈ చిత్రానికి పని చేయడం వెనుక రామకృష్ణ స్నేహితుడు సోదరుడైన గరుడాచారి హస్తం ఉందని బి.ఎస్. రంగా చెప్పారు. ‘లైలామజ్ను’ సౌండ్ డిజైనింగ్‌గా పని చేసిన వి. శ్రీనివాస రాఘవన్ తన వంతు అద్భుతమైన పాత్రను విజయవంతంగా చేశారు. ఇప్పుడు టీవీ యూట్యూబ్‌లో ఆ చిత్రం చూస్తే ఆయన ప్రతిభ తెలుస్తుంది. ఆయనకు సహాయకుడిగా ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ వ్యవహరించారు. దేవదాసుకు దర్శకుడిగా చేసిన వేదాంతం రాఘవయ్య ‘లైలామజ్ను’ చిత్రానికి నృత్య దర్శకుడు. చిత్రంలో 17 పాటలున్నాయి. ఘంటసాల, లీల, భానుమతి, జిక్కి తదితరులు పాడారు.
రామకృష్ణ తొలి చిత్రం రత్నమాల. గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరో చిత్ర నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న వేళ ముంబైలో 1945లో విడుదలై టాకీ చిత్రం ‘లైలా మజ్ను’ (మొదటి హిందీ టాకీగా చెబుతారు) ఆయన దృష్టిలో పడింది. డి.యల్ నారాయణ (దేవదాసు నిర్మాత) రామకృష్ణతో ఏకీభవించారు. ప్రొడక్షన్ పనులలో కూడా భాగమయ్యారు. అలా వేదాంతం, సి.ఆర్. సుబ్బరామన్‌ల స్నేహం కుదిరిందనే వారు ఉన్నారు. వెంటనే తెలుగు వెర్షన్ కోసం పనులు ప్రారంభించారు. స్క్రిప్ట్ సంభాషణల బాధ్యతను సముద్రాల సీనియర్ వారికి అప్పగించారు. భానుమతి (రామకృష్ణ భార్య), అక్కినేని, సి.ఎస్.ఆర్, శ్రీరంజిని(జూ), శివరావు, హేమలత, సీతారాం తదితరులను ఎంపిక చేసుకున్నారు. చిత్రాన్ని 1949 అక్టోబర్ 1న విడుదల చేశారు.
కథతో కనెక్ట్ కావడమే ప్రధానం!
‘లైలా మజ్ను’ కథ లైలా, ఖైస్‌ల మధ్య నడుస్తుంది. సూఫీ సాహిత్యంలో ‘క్లాసిక్’ గా 12వ శతాబ్దపు గొప్ప అలంకార వర్ణాలలో పద్యకావ్యంగా భాక్ష్ వ్యాఖ్యానం. ఇది ఏడో శతాబ్దంలో జరిగిన వాస్తవిక కథనం అనేవారు ఉన్నారు. ఈ ప్రేమ కావ్యం ఎంతోమంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది. తొలిసారిగా మదన్ 1922లో (మూకీ) తరువాత 1927లో మకిలాల్ జోషిలు నిర్మించారు. 1931లో కంజి భాయ్ రాథోడ్ టాకీగా హిందీలో తీశారు. 1936లో పర్షియన్ భాషలో ఈస్ట్ ఇండియా పిక్చర్స్, 1940లో ధర్మవీర్ సింగ్ పంజాబీలో, 1941లో నాగ్నాథ్ పిక్చర్స్, 1945లో మరల హిందీలో తీశారు. భానుమతి తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేశారు. హిందీ వెర్షన్‌లో ఎస్.డి. సుందరం మాటలు, పాటలు రాశారు. 1950, 1976లో హిందీ, బెంగాలీలలో, మరల 1982లో కూడా నిర్మించారు. ఇలా పలు భాషల్లో ఎంతోమంది తీశారు. ఇన్నేళ్లయినా ఒక చిత్రం విజయవంతం కావడానికి ‘ప్రచారార్భాటాలు’ కన్నా కథాకథనాలు వీటికి రక్త మాంసాలద్దే భావోద్వేగాల చిత్రణ బలంగా ఉంటాయని లైలా మజ్ను చిత్రం తెలియజేస్తుంది. చిత్రం చిన్నదా, పెద్దదా, డబ్బింగా, స్ట్రెయిటా అనే విభజన ప్రేక్షకులకు నాడు, నేడు కూడా లేదు. కథ తన మనసుకు నచ్చాలి. తను కథతో కనెక్ట్ కావాలి. ఇది ప్రధానం. ఆనాటి చిత్రాలు, దర్శకులు, నిర్మాతలు ఇదే ఆలోచించారు. సాంకేతికత అభివృద్ధి లేని నాటి చిత్రాలు ‘నేటికీ’ అత్యద్భుత సాంకేతిక నైపుణ్య చిత్రాల నమూనాలుగా నిలిచి ఉన్నాయనేది విస్మరించరానిది సత్యం. మరి నేడు....!?
భమిడిపాటి గౌరీశంకర్
94928 58395
Also Read: ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’