- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయిదు రోజుల పండుగ..
దీపావళిని సాంప్రదాయకంగా ఐదు రోజుల పండుగ అంటారు. ధన్వంతరీ త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, యమద్వితీయ అనే పండుగలు వరుసగా వస్తుండటంతో దీన్ని అయిదు రోజుల పండుగగా భావిస్తుంటారు. ధన త్రయోదశి పేరిట బంగారం కొనడం భారతీయులకు చాలా కాలంగా అలవాటు. దీపావళితో ముడిపడి ఉన్న పండుగలు అటు ఉత్తరాదిలోనూ, ఇటు దక్షిణాదిలోనూ జరుపుకోవడం విశేషం. వీటి వివరాలు తెలుసుకుందాం.
ధన్వంతరీ త్రయోదశి
వాడుకలో ధన త్రయోదశి అని పిలుస్తారు. ఆ రోజున బంగారం కొనాలనే ఆశ పడుతుంటాం! కానీ ఆరోజు 'ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన 'ధన్వంతరీ భగవాన్' జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు ధన్వంతరి.
నరక చతుర్దశి..
నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కోసం పితృదేవతల ప్రీతి కోసం ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాగ్జోతీషపురం (నేటి అస్సాం)ను పాలించే 'నరకుడు' నరరూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అద్భుత శక్తుల సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చేవాడు, కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు (రాచకన్యలు) బందీ లుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ (భూదేవీ అవతారం)తో కలసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని, శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి'.
దీపావళి..
రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకోవడం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనం దంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూ పం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాం. వ్యాపారస్తులు కొత్త లెక్కలు రాసుకుంటారు.
బలిపాడ్యమి
వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి. 'ఇంతింతైవటుడింతై నభోరాశిపైనల్లంతై' అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణిచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం.
యమ ద్వితీయ
సూర్య భగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు.. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా! జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మానుసారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్లటం లేదు యముడు. చెల్లి బతిమాలింది.. ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని.. చెల్లెలు కార్తీక శుద్ఘ విదియ, మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెళ్లి హాయిగా కొద్ది సేపు ఉండి భోజనం చేసి వచ్చాడు యముడు. చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెళ్లి చెల్లెలికి కట్నం కానుకలిచ్చి వాళ్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.
-బ్రహ్మశ్రీ తిరుమల మనోహరాచార్య
శ్రీ రామానుజ యాగ్నిక పీఠం
99890 46210
- Tags
- Diwali festival