- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలుపెరుగని బాటసారి హరీశ్
అభివృద్ధిలో అలుపెరుగని బాటసారి. అహర్నిశలు కష్టించే శ్రమజీవి. ఆత్మీయతకు, అభిమానానికి, ఆదరణకు నిదర్శనం. హరీశ్ రావు ఉద్యమ తోవ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వరకు కేసీఆర్ సంకల్ప సిద్ధిని శిరసావహించి కార్యరూపంలో పెట్టిన నేత. సిద్దిపేట అభివృద్ధి, సంక్షేమానికి సద్దిమూట. తెలంగాణ జన జీవనంలో మమేకమై బతుకు భరోసా కల్పించిన నేత. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా వారిని ఓదార్చి ధైర్యం నింపుతారు. సిద్ధిపేట ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే, మంత్రిగా, పార్టీ నేతగా తెలంగాణ నలుమూలలా బుల్లెట్ వేగంతో చుట్టేస్తూ ప్రజల పక్షాన నిలబడే నిబద్ధత కలిగిన నాయకుడు. చిన్న మెసేజ్ పెట్టినా చాలు, తాను స్వయంగా పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపుతారు. అధికారులను, పార్టీ నాయకులను పంపి సమస్య లేకుండా చూస్తారు. హరీష్ రావు ఏ నియోజకవర్గంలో అడుగు పెడితే అక్కడ పార్టీ విజయం సాధిస్తుందని బలమైన నమ్మకం పార్టీలో ఉంది. అందుకే, ఆయన ట్రబుల్ షూటర్ పేరు తెచ్చుకున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీరిక లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రిగా 'కాళేశ్వరం' ప్రాజెక్టు నిర్మాణంలో కార్మికుడిలా చెమటోడ్చి పని చేశారు. ఆర్థిక మంత్రిగా ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారు. ఆరోగ్య మంత్రిగా ఆరోగ్య తెలంగాణ దిశగా పని చేస్తున్నరు.
సిద్దిగాంచిన సిద్దిపేట
చరిత్ర పుస్తకంలో చెరగని సంతకం సిద్దిపేట. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పురిటి గడ్డ రాష్ట్రానికి, దేశానికి రోల్ మోడల్, అభివృద్ధికి ఇది చిరునామా, ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే ప్రతి పథకానికి అదో రీసెర్చ్ సెంటర్, సిద్దిపేట పచ్చతోరణంలా స్వాగతం ఇస్తుంది. కళకళలాడే రంగనాయకసాగర్ జలాశయాలు, ఆక్సిజన్ అందించే పార్కులు, జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, నూతన కలెక్టరేట్ భవనం, పోలీస్ కమిషనరేట్, గోల్కొండ షోరూం, ఐటీ టవర్, కోమటి చెరువు సుందరీకరణ వంటి ఎన్నెన్నో అభివృద్ధి నమూనాలు, ఎన్నో అద్భుత అభివృద్ధి కళాఖండాలు సిద్ధిపేట ఒడిలో ఇమిడి ఉన్నాయి. రానున్న కొద్ది రోజుల్లోనే సిద్దిపేటలో రైలు కూత వినిపిస్తది. స్వచ్చ భారత్‌లో సిద్ధిపేట అనేక అవార్డులను గెలుచుకుంది. సిద్దిపేట గ్రామాలకు అవార్డుల పంట. పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో సిద్దిపేట గురించి ప్రశ్నలు రావడం విశేషం. వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి జరిగిన అభివృద్ధి చూసి పోతారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా
నాడు నీళ్ల మంత్రిగా పేరు తెచ్చుకుని... నేడు ఆర్థిక మంత్రిగా.. ఆరోగ్య మంత్రిగా అను నిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నరు. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ళలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తి చేయడంలో శ్రమటోడ్చారు. అలాగే ఆర్థిక మంత్రిగా అన్ని రంగాల్లో అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆర్థిక లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్క ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను కూడా హరీష్ రావుకే సీఎం కేసీఆర్ అప్పగించారు. కేసీఆర్ ఆదేశం తూ.చ తప్పకుండా పాటిస్తూ నేడు తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా అవతరించింది. ప్రతి పల్లె, పట్టణం, బస్తీలో వైద్య సేవలు అందుతున్నాయి. కేసీఆర్ సంకల్పానికి తోడై మంత్రి హరీష్ రావు నిరంతరం ప్రజా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ పెట్టారు. కరోనా సమయంలో గానీ, ఇతర సందర్భాల్లో గానీ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో హరీష్ రావు కృషి గొప్పది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2 అయితే. హరీష్ రావు పుట్టిన రోజు జూన్ 3. కలిసి వచ్చే సంతోషం అంటే ఇదే. సిద్దిపేట ప్రజలకు సేవ చేయడంలో ఉన్న తృప్తికి మించింది మరొకటి లేదంటారు హరీశ్ రావు. అన్నకు జన్మదిన శుభాకాంక్షలు..
చిటుకుల మైసారెడ్డి,
సీనియర్ జర్నలిస్ట్
94905 24724