- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ రచయిత కోణంలో సినిమాలు..
సినీ ఆర్టిస్టుల జీవితాలు కాలం కంటే ముందు పరుగెత్తాలి. సినిమాకు ఒప్పుకున్నప్పటినుంచి అది పూర్తయ్యేవరకు యూనిట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఊపిరాడని క్షణాలుగానే ఉంటుంది జీవితం. టీజర్, ట్రైలర్ సమయాల్లో తప్ప తామేం చేశామన్నది చెప్పుకోలేని తీవ్రమైన ఒత్తిడి. కానీ వీళ్లకు కూడా తాము చేసే సినిమాలపైనే కాదు.. ఇతరులు తీసిన సినిమాలపై కూడా తమవైన అభిప్రాయాలు ఉంటాయి. తెలుగు సినీపరిశ్రమలో స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా ఉన్న నేను ఈ మధ్య చూసిన సినిమాలపై క్లుప్త అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను..
గర్వాన్ని జయించిన టీచర్
ఒకరికి ఏదైనా విషయం చెప్తున్నామంటే, అవతలివాళ్లు మనం చెప్పే విషయం వింటున్నారంటేనే మనకు ఎక్కడో గర్వం పెరుగుతూ ఉంటుంది. ఆ గర్వాన్ని జయించిన మనిషి ఎవ్వరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయులే. 35 సినిమాలో ఉన్న సరస్వతి పాత్రకు టీచర్‌లో అలాంటి సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఆమె క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా డిజైన్ చేశారు. అంతకంటే గొప్పగా ఉంది నివేదాగారి నటన. గుర్తుపెట్టుకుని మరీ అనుసరించాల్సిన మాటలు, గొప్పగా అనిపించిన మాటలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. చిన్న పిల్లలు అంత అద్భుతంగా యాక్ట్ చేయడం చాలా బాగుంది. భార్యాభర్తల బంధం, కుటుంబ సంబంధాలను కథలో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేస్తూ గొప్పగా చెప్పారు. నివేదా థామస్‌గారు ఒక గొప్ప నటి. ఇప్పటి వరకూ చేసిన ప్రతి క్యారెక్టర్‌ని చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో సరస్వతి క్యారెక్టర్‌కి ప్రాణం పోయిడం అయితే అద్భుతః. చాలా మంచి మనిషి అని కూడా చాలా విన్నాను. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో కనీస సంస్కారం లేకుండా ఆమె శరీరం గురించి మాట్లాడిన మాటలు, చర్చలు గుర్తొచ్చి బాధనిపించింది.
మంచి సినిమాకు నిర్వచనం
ఎలా హిట్ అయిందిరా బాబూ.. అరే...పర్లేదే....బాగానే ఉందే.. చాలా చాలా బాగుందిరా బాబూ....ఆయ్ మూవీ చూస్తూ ఉన్నప్పుడు మైండ్‌లో రన్ అయిన థాట్ ప్రాసెస్. థియేటర్లోనే చూడాల్సింది. వాళ్ళూ వీళ్ళూ చెప్పిన ఫీడ్ బ్యాక్ విని చూడలేదు. ఇప్పుడు కూడా ఈ సినిమాకు వర్క్ చేసిన ఒక టెక్నీషియన్ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాక చూడాలనిపించింది. సినిమా మొత్తం చూశాక ఇలాంటి సినిమాను థియేటర్‌లో చూడకుండా తప్పు చేశానా అనిపించింది. ఈ చివరి మాట సినిమావాడిగా చెప్పలేదు. సిన్సియర్‌గా, జెన్యూన్‌గా చేసిన వర్క్‌ని గౌరవించడంలో నాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అలా వర్క్ చేసిన సినిమాను థియేటర్లో చూడడం న్యాయం అనిపిస్తుంది. గోదావరి జిల్లాల్లోనే నివసిస్తున్న మా అమ్మ, నాన్న, తమ్ముడితో కలిసి అక్కడే ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే రేంజ్ ఉండేది. అందరూ చూడాల్సిన మంచి సినిమా.
పేకమేడలు.. ప్రతి సీన్ విజువల్
ఈ సినిమా చాలా బాగుంది. సినిమాలో ఉన్న ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్‌ని నేను నిజ జీవితంలో చూశాను. సూపర్బ్ ఫినిషింగ్. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. చివరి 40 నిమిషాలు అయితే నిజ జీవిత కథలను చూపించిన మలయాళం సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. మతం విషయంలో, జీవితం విషయంలో ఈ డైరెక్టర్‌కి ఉన్న సామాజిక స్పృహకు హ్యాట్సాఫ్.
వెట్టయాన్ టైటిల్
vettaiyan సినిమా టైటిల్ తెలుగులో ఎందుకు లేదు అని అడిగారు మంచిదే. గొప్ప తెలుగు భాషాభిమానమే. మరి అదే భాషాభిమానం ఇతర టైటిల్స్ విషయంలో ఉండదా? మన చుట్టూ ఉన్న ఎన్ని సంస్థలకు, మనం కొనే ఎన్ని వస్తువులకు తెలుగులో టైటిల్స్ ఉన్నాయి? పుట్టిన పిల్లలకు అచ్చ తెలుగు పేర్లు పెట్టడానికి నామోషీగా ఫీలయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఫలానా సినిమాకు తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేదు అనే డిస్కషన్ ఎందుకు? ఒకవేళ మాట్లాడితే, భాషాభిమానమే అయితే అన్ని రకాల పేర్లూ తెలుగులోనే ఉండాలి అని కదా మాట్లాడాల్సింది. సినిమా పేర్లు మాత్రం తెలుగులో ఉంటే భాషను బతికించినట్టేనా? మన పేర్లు, మనం తిరిగే ప్రాంతాల పేర్లు, మనం కొనే వస్తువుల పేర్లు ఇతర భాషల్లో ఉంటే తెలుగుకు తెగులు పట్టదా?
హను రావూరి
సినీ రచయిత