పేరుకేనా మానవ హక్కులు!?

by Ravi |   ( Updated:2022-11-09 18:30:37.0  )
పేరుకేనా మానవ హక్కులు!?
X

ఏదైనా కంపెనీ పని భారం తగ్గించుకోవడం లేదా పొదుపు చర్యలు తీసుకోవాలని తలచినప్పుడు ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం తీసుకోకూడదు. సంస్థలలో ఇలాంటి ప్రచారం ఉండకూడదు. ప్రతి ఉద్యోగి హక్కును గౌరవించాలి. ఉద్యోగిని గౌరవప్రదంగా చూసుకోవాలి. ఉద్యోగులే సంస్థలకు మూల స్తంభం. వారే ఊపిరి. వారు లేకపోతే సంస్థలు ఆగిపోతాయి. మనుగడ సాగించలేవు. ట్విట్టర్ లాంటి సంస్థే ఉద్యోగులను తొలగిస్తే చిన్న చితకా సంస్థలు ఏ పాటివి. అందుకే ఉద్యోగులతో స్వేచ్ఛా వాతావరణంలో పని చేయించుకోవాలి. మానవ హక్కులు మానవ పురోగతి అభివృద్ధి సంక్షేమం ముడిపడి ఉంటాయి. వ్యక్తి ఉన్నతంగా వ్యక్తిత్వ వికాసంగా పురోగమించాలంటే మానవ హక్కులు అవసరం.

విశ్వమంతా ఒకే కుటుంబంగా ఉండాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 1948లో మానవ హక్కులను ప్రకటించింది. దాని చొరవతోనే వాటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వీటికి గొప్ప ఆశయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన రక్షణ పొందే స్వేచ్ఛ, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం, వ్యక్తులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను వినియోగించుకునే స్వేచ్ఛ తదితర హక్కులేవి ఆచరణకు రావడం లేదు.

ప్రపంచంలో ప్రతి చోటా మానవ హక్కులకు అన్యాయమే జరుగుతుంది. 'మా హక్కు మాకు కావాలి' అని నినదించడం ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం. ఇటీవల ట్విట్టర్ యాప్ ఏకంగా తన ఉద్యోగులను తొలగించడం తీవ్ర దుమారం రేపింది. ఇది కేవలం ట్విట్టర్‌లోనే కాదు ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటుంది. అలా తొలగించబడిన ఉద్యోగులు తదుపరి ఎక్కడా ఉద్యోగం రాక కుటుంబాలను పోషించలేక సతమతమవుతున్నారు. దిక్కు తోచని స్థితిలో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారికి మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి? అందుకే ఈ అంశం మీద యుఎన్ఓ అధ్యక్షుడు వొల్కర్ టక్కర్ స్పందించారు. ఉద్యోగులను తొలగించడం సరికాదని, దీంతో వారు అభద్రతా భావంలో ఉంటారని, వారి కుటుంబాలు వీధిన పడతాయని, ఇది మంచి పద్ధతి కాదని ట్విట్టర్ నూతన యజమానికి లేఖ రాశారు. ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ట్విట్టర్ మాత్రమే చేయడం లేదు అన్ని కంపెనీలు తొలగిస్తూనే ఉన్నాయి. నిజానికి ఉద్యోగులను తొలగించాలనుకుంటే ఆరు నెలల ముందుగా తెలియజేయాలి. వారికి అప్పటి వరకు వేతనం ఇవ్వాలి. కొన్ని సంస్థలు అవేమి పట్టించుకోవడం లేదు. ఈ తొలగింపు ప్రక్రియ ఎక్కువగా మన దేశంలోనే జరుగుతోంది. ఇంత జరుగుతుంటే మానవ హక్కులు ఎక్కడ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనే ప్రశ్న మెదులుతుంది.

అభివృద్ధి వారిపై ఆధారపడి

ఏదైనా కంపెనీ పని భారం తగ్గించుకోవడం లేదా పొదుపు చర్యలు తీసుకోవాలని తలచినప్పుడు ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం తీసుకోకూడదు. సంస్థలలో ఇలాంటి ప్రచారం ఉండకూడదు. ప్రతి ఉద్యోగి హక్కును గౌరవించాలి. ఉద్యోగిని గౌరవప్రదంగా చూసుకోవాలి. ఉద్యోగులే సంస్థలకు మూల స్తంభం. వారే ఊపిరి. వారు లేకపోతే సంస్థలు ఆగిపోతాయి. మనుగడ సాగించలేవు. ట్విట్టర్ లాంటి సంస్థే ఉద్యోగులను తొలగిస్తే చిన్న చితకా సంస్థలు ఏ పాటివి. అందుకే ఉద్యోగులతో స్వేచ్ఛా వాతావరణంలో పని చేయించుకోవాలి.

మానవ హక్కులు మానవ పురోగతి అభివృద్ధి సంక్షేమం ముడిపడి ఉంటాయి. వ్యక్తి ఉన్నతంగా వ్యక్తిత్వ వికాసంగా పురోగమించాలంటే మానవ హక్కులు అవసరం. 'అందరికి ఒకే న్యాయం' అని చెబుతోంది మానవ హక్కుల కమిషన్. ఈనాడు మానవ హక్కుల భావన విశ్వవ్యాప్తంగా విస్తరించబడి ఉన్నందున ఎక్కడైనా వాటి ఉల్లంఘన జరిగే ప్రమాదం ఉంది. కనుక ఏ సంస్థ అయినా పనిచేసేవారికి ఉత్తమ జీవితాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఉద్యోగులు ఎక్కడ మార్పు రావాలని కోరుకోరు. అందుకే ప్రతి ఒక్కరూ మార్పులకు అనుగుణంగా మారి నడుచుకోవాలి. మానవ హక్కులు మానవ పరిరక్షణకే అనే విషయం అందరికీ తెలిసినప్పుడే వాటికి సార్ధకత.


కనుమ ఎల్లారెడ్డి

93915 23027

Advertisement

Next Story

Most Viewed