ఆదర్శ గిరిజన నేత డియోరీ

by Ravi |   ( Updated:2022-11-29 18:31:12.0  )
ఆదర్శ గిరిజన నేత డియోరీ
X

గిరిజన భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా, స్వేచ్ఛ కోసం, ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21-23 మధ్య డియోరీ 'ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు' చేయించారు. వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకుల ద్వారా మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన దృష్టి ఎప్పుడూ అట్టడుగు వర్గాల సంక్షేమంపై ఉండేది. గిరిజన సమాజం సంఘటితం కావడానికి ఆయన ఒక కారణం. అసోంలో ముస్లిం చొరబాట్లను, దాని వలన వచ్చే పరిణామాలను ముందే పసిగట్టిన భీంబర్, అసోంను పాకిస్తాన్‌లో విలీనం చేయబోవడాన్ని సహించలేదు. బ్రిటిష్ వైస్రాయ్ అసోంను పాకిస్తాన్‌లో చేర్చాలని ఒక ప్రణాళికను రచించారు. కానీ, భీంబర్ ఆ కుట్రలను తిప్పికొట్టారు. తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ బ్రిటిష్ అధికారాన్ని సవాల్ చేశారు.

యన భారతదేశంలోని గిరిజనులలో ఆదర్శనేతగా పేరుగాంచిన రాజకీయ చతురతుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, తూర్పు పాకిస్తాన్‌లో విలీనం నుంచి అసోంను కాపాడిన జననాయకుడు. అంతేకాక సివిల్ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించినవాడు. గిరిజనుడనే కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించినా పట్టుదలతో న్యాయవాద వృత్తిలో చేరి సమర్థుడిగా పేరుగాంచిన మేధావి. ఆయనే 'భీంబర్ డియోరీ'(Bhimbor Deori) భారత స్వాతంత్ర్య మహోత్సవాల వేళ మన దేశ నాయకుల సేవా భావాన్ని మననం చేసుకోవడం అనివార్యం.

ఆయన పోరాటాలు

భీంబర్ డియోరీ 1903 మే 16న అసోంలోని శివసాగర్ జిల్లా వనిదిహింగ్ గ్రామంలో గోదారం డియోరీ-బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. సివిల్ పరీక్షలలో ప్రథమస్థానం సంపాదించారు. న్యాయవాద పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యారు. స్వదేశీవర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలు పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. విధానసభలో గిరిజనుల కొరకు ఐదు స్థానాలు రిజర్వ్ అయ్యేలా కృషి చేశారు.

న్యాయవాదిగా భీంబర్ విలాసవంత జీవితం గడపడానికి అవకాశం ఉన్నప్పటికీ, స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి గిరిజన వర్గాల స్వాతంత్య్రం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు. తన ప్రజలకు భూమి కోసం, వారికి భూ ఆదాయాన్ని అందజేయడం కోసం 1933లో 'అసోం బ్యాక్‌వర్డ్ ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్' ను స్థాపించారు. దానికి వ్యవస్థాపక జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. వివిధ విద్యా సంస్థల వసతి గృహాలలో ఉండి చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను జనరల్ డైనింగ్ హాలులోకి అనుమతించాలని కోరుతూ 1941 జూన్ 18న ఆందోళన చేశారు. ఆయన దూరదృష్టి తోటి గిరిజనుల భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి సహాయపడింది.

Also read: త్యాగశీలి హోలిక

అసోంను కాపాడి

గిరిజన భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా, స్వేచ్ఛ కోసం, ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21-23 మధ్య డియోరీ 'ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు' చేయించారు. వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకుల ద్వారా మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన దృష్టి ఎప్పుడూ అట్టడుగు వర్గాల సంక్షేమంపై ఉండేది. గిరిజన సమాజం సంఘటితం కావడానికి ఆయన ఒక కారణం. అసోంలో ముస్లిం చొరబాట్లను, దాని వలన వచ్చే పరిణామాలను ముందే పసిగట్టిన భీంబర్, అసోంను పాకిస్తాన్‌లో విలీనం చేయబోవడాన్ని సహించలేదు. బ్రిటిష్ వైస్రాయ్ అసోంను పాకిస్తాన్‌లో చేర్చాలని ఒక ప్రణాళికను రచించారు. కానీ, భీంబర్ ఆ కుట్రలను తిప్పికొట్టారు( to stop merge Assam into East Pakistan). తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ బ్రిటిష్ అధికారాన్ని సవాల్ చేశారు.

దౌత్య వ్యూహాల ద్వారా అసోం భారతదేశంలోనే ఉండేలా కాపాడుకున్నారు. ఆయన కృషితో అసోం 'ప్రావిన్స్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా' లో చేర్చబడింది. గిరిజనులలో సమర్థవంత నేతగా భీంబర్ డియోరిని రాజ్యాంగ సభలో నియమించాలని కాంగ్రెస్ అభ్యర్థించినా అది నెరవేరలేదు. దానికి బదులుగా 1946లో అసోం అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వాతంత్య్ర పోరాటంలో భీంబర్ చేసిన పోరాటం స్వరాజ్‌ని స్వీకరించడానికి ప్రజలను సన్నద్ధం చేయడంలో అవిరళంగా కృషి చేశారు. ఈ విధంగా సమాజహిత, దేశహిత పనులన్నీ తన 44 సంవత్సరాల వయస్సు లోపలే చేశారు. 1947 నవంబర్ 30న తనువు చాలించారు. అసోం ప్రజల హృదయాలలో భీంబర్ డియోరీ ఆదివాసీల నాయకుడిగానే గాక ఆదర్శ జన నేతగా నిలిచారు.

(నేడు భీంబర్ డియోరీ వర్ధంతి)


గుమ్మడి లక్ష్మీ నారాయణ

సామాజిక రచయిత

9491318409

Advertisement

Next Story

Most Viewed