మరణం సమాధానం కాదు

by Ravi |   ( Updated:2022-09-03 17:11:58.0  )
మరణం సమాధానం కాదు
X

వధువులు భయంకర మానసిక ఒత్తిడిలో ఉండి, అంతుపట్టని రీతిలో సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. బలవంతపు వివాహాలు, వరకట్న డిమాండ్లు, వేధింపులు, చదువు లేదా ఉద్యోగంలో సక్సెస్ కాలేకపోవడం, సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడంతో మహిళలు తీవ్ర మనోవేదనకు గురై చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెళ్లయ్యాక కూతురి పట్ల తమ బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావించటంతో వధువులు ఒంటరి‌గా ఫీలవుతున్నారు. సమాజంలో మార్పు అవసరము.భూమి మీదున్న అన్నీ జీవరాశులలో తెలివితేటలు, ఆలోచనలు. విచక్షణ జ్ఞానం కాస్తంత మనుషులలోనే ఎక్కువగా ఉంటాయనేది నిజం.

భూమి మీదున్న అన్నీ జీవరాశులలో తెలివితేటలు, ఆలోచనలు. విచక్షణ జ్ఞానం కాస్తంత మనుషులలోనే ఎక్కువగా ఉంటాయనేది నిజం. ఈ మధ్య వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తే మనుషులలో ఆ విలువలు కనుమరుగైపోతున్నాయా? అనిపిస్తున్నది. ఎందుకంటే, వెనకా ముందు, మంచి చెడు ఆలోచించకుండా అపరిపక్వ నిర్ణయాలతో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యంతరంగానే ముగించేస్తున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిపోతున్నారు.

తాత్కాలిక బాధలకు శాశ్వత పరిష్కారం ఆత్మహత్యలే శరణ్యమనుకునే అమాయక యువత ఎన్నో కుటుంబాలకు తీరని వేదనను, విషాదాన్ని కలిగిస్తున్నారు. ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్లిళ్లలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట కాబోయే భర్తకు 'సర్‌ప్రయిజ్' ఇచ్చిన ఘటనను మరువకముందే, మరో మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసింది. అది కూడా పెళ్లి అయిన నెల రోజులలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది. మరో నవ వధువు అప్పగింతలు అయ్యేలోపే శాశ్వతంగా నిద్రలోకి జారుకుంది. తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

వాదనలు మామూలే

ఎంత మంచి దంపతులైనా అప్పుడప్పుడూ ఇద్దరి మధ్య వాదనలు, గొడవలు, తగాదాలలాంటివి జరగడం చాలా సహజం. అసలు ఇష్టం లేకుండా పెళ్లి బంధంలోకి అడుగుపెడితే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోలేం. అవగాహన కూడా లేకపోతే వారి దాంపత్య జీవితం నిస్తేజంగా ఉంటుంది. పైపై మాటలే తప్ప అంతర్లీనమైన సహజ ప్రేమ ఉండదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు సమాజంలో గౌరవం. గుర్తింపు ఉంటుంది. ఎలాంటి అడ్డంకి ఉండదు. ఎందుకంటే అవి బాగా తెలిసిన, కుల, మత పెద్దల సమక్షంలో జరిగేవి. పెళ్లి కూతురు కానీ, పెళ్లి కొడుకు గానీ సాధారణంగా పెద్దల మాటకు ఎదురు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ రకంగా కుదిర్చిన సంబంధాలలో అత్యధికం విజయవంతం అవుతున్నాయి. కానీ, సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్న వేళ, తల్లిదండ్రుల, మనుషుల ఆలోచనా విధానాలలో మార్పులు. అధునాతన జీవనశైలి, నచ్చినవాన్ని కోరుకునే స్వేచ్ఛ అనాదిగా వస్తున్న ఆచార, సాంప్రదాయాలను తుడిచి వేస్తున్నాయి.

కొన్ని ఉదాహరణలు

బెంగళూరు హాసన్‌ సమీపంలోని కిత్తనగర గ్రామానికి చెందిన ఒక వధువు ఇష్టం లేని పెళ్లి చేశారని, మెట్టినింట ఉండలేనని చెప్పి భర్తకు విషం మాత్రలు, ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది. తనకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఓ వరుడు తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసుకోమనడంతో ఓ యువతి కాబోయే వరుడిని 'సర్‌ప్రయిజ్' ఇస్తానంటూ కత్తితో గొంతు కోసింది. మరో మహిళ తన ప్రియుడితో కలిసి పెళ్లి జరిగిన నెల రోజులలోనే భర్తను అంతం చేసింది.

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల కు చెందిన అమ్మాయికి జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి కి చెందిన వ్యక్తితో రెండో పెళ్లి చేయాలని అనుకున్నారు. తనకు ఇష్టం లేదని చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో ఈ యువతి మనస్తాపం చెంది పురుగుల మందు తాగి మృతిచెందింది. ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే నవ వధువు ప్రాణాలు తీసుకున్న ఘటన మహబుబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన 15 రోజులకే అమెరికా వెళ్లిన భర్త రెండేండ్లు గడిచినా తనను తీసుకెళ్లకపోవడంతో ఓ అమ్మాయి బంగ్లా మీద నుంచి దూకి చనిపోయింది. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఎందుకిలా జరుగుతోంది ?

వధువులు భయంకర మానసిక ఒత్తిడిలో ఉండి, అంతుపట్టని రీతిలో సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. బలవంతపు వివాహాలు, వరకట్న డిమాండ్లు, వేధింపులు, చదువు లేదా ఉద్యోగంలో సక్సెస్ కాలేకపోవడం, సామాజిక, ఆర్థిక స్వాతంత్రం లేకపోవడంతో మహిళలు తీవ్ర మనోవేదనకు గురై చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెళ్లయ్యాక కూతురి పట్ల తమ బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావించటంతో వధువులు ఒంటరి‌గా ఫీలవుతున్నారు. సమాజంలో మార్పు అవసరము. మగపిల్లలు బయటి పనులు, ఆడపిల్లలు ఇంటి పనులు చెయ్యడానికే పుట్టారనే భావన అనాదిగా తల్లిదండ్రులలో నిల్చిపోయింది. మనం స్వచ్ఛ భారత్ ద్వారా దేశాన్ని శుభ్రం చేస్తున్నాం. మన మనస్సులను మాత్రం శుభ్రం చేయడం లేదు సుమా!

డా. బి. కేశవులు. ఎండీ

మానసిక, కుటుంబ వైద్య నిపుణులు

85010 61659

Advertisement

Next Story