- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సరైన నాయకత్వాన్ని ఎంచుకో!

ఒకప్పుడు ఒక విద్యార్థి డిగ్రీలో ఉత్తీర్ణులయ్యాడంటే.. ఎంతో జ్ఞానాన్ని పొందిన వాడిగా కీర్తించబడేవారు. ఆ డిగ్రీ పట్టా పొందిన వ్యక్తిని ఎంతో ఉన్నతుడిగా గుర్తించేవారు. కానీ నేడు ఎందరో విద్యార్థులు డిగ్రీ పట్టాలను పొందినప్పటికీ వారికి సమాజం పట్ల బాధ్యత లేకపోవడం విచారకరం. నేడు డిగ్రీ పట్టా పొందిన చాలా మంది పట్టభద్రులకి ఎమ్మెల్సీ ఎన్నిక అంటూ ఒకటి ఉంటుందనే విషయం తెలియకపోవడం గమనార్హం. ఒకవేళ తెలిసిన కొందరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోరు.. చేసుకున్నా ఓటు వేయరు.. వారికి ఎందుకీ ఇంత నిర్లక్ష్యం! చాలా మంది పట్టభద్రులకి స్థానిక ఎన్నికలు, శాసనసభ ఎన్నికలపై ఉన్నంత అవగాహన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉండదు. అందుకు కారణం ఈ ఎన్నికలపై అవగాహన లేకపోవడమో.. బరిలో నిలబడ్డ అభ్యర్థులపై నమ్మకం లేకపోవడం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్య ర్థులు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించరు..
ఓటును తప్పకుండా వినియోగించుకోవాలి!
ఎమ్మెల్సీ అభ్యర్థులారా, మీకు డిగ్రీ చదివిన విద్యార్థి ఓటు ముఖ్యమైనప్పుడు వాళ్ల భవిష్యత్తు, బాధ్యత మీది కాదా? ఇప్పటివరకు ఒక్క నాయకుడన్న వారికి ఉపయోగపడే హామీలను ఎక్కడన్నా ప్రస్తావిస్తున్నారా? పట్టభద్రులకి కావా ల్సిన ఉద్యోగ నోటిఫికేషన్‌ల గురించి ఒక్క నాయకుడైనా ఒక సభలో అయినా మాట్లాడారా? ఎందరో గ్రాడ్యుయేట్స్ ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎప్ప టికీ వారు నిరుద్యోగులుగానే మిగిలిపోవాలా? ఎంతసేపటికీ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యండి అని అడిగే నోరు గెలిచాక ఒక్క నిరుద్యోగిని అయినా పిలిచి తన కష్టం వింటారా? ఓటు వినియోగించుకోండి అని నిరుద్యోగుల చెవుల్లో మైకులు పెట్టే నాయకులు.. గెలిచాక అదే చెవుల్లో పూలు పెడుతున్నారు.. దేహి అని నిరుద్యోగుల ముందు చేయి చాచి ఓట్లు అడుక్కొని చివరికి మళ్లీ నిరుద్యోగి మొఖం కూడా చూడట్లేదు. అందుకే ఓటర్లు సైతం వారి ఓటును దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ఇది తప్పు. పట్టభద్రులు తమ ఓటును తప్పకుండా వినియోగించుకోవాలి. మన ఓటే మన ఆయుధం. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న నాయకులు అందర్నీ ఒకసారి పరిశీలించి మన భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడిని మొదటి ప్రాధాన్యతలో ఉంచండి. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సైతం గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పాల్గొనేలా అవగాహన కలిగించాలి.
అస్మా
ఉస్మానియా యూనివర్సిటీ
72868 32747