- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ధరలు కోడైకూస్తున్నాయ్!
ధరలు..సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది. బోర్డుల రేట్ల మార్చునకు ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లయ్ లాంటి హేతుబద్ధతలెన్ని ఉన్నా... గ్రహీత, అనుభవ కర్త వినియోగదారులేనన్నది జగమెరిగిన సత్యమే. ఆహార అలవాట్ల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాలెన్ని వల్లె వేసినా రేట్ల తగ్గింపు, సాంత్వన దుస్సాధ్యమే. ఏతావాతా సామాన్యుడి సణుగుడు సశేషం!
సరఫరా తగ్గటంతో..
ధరా ఘాతం... ధరలు మండుతున్నాయి. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట, ద్రవ్యోల్బణం... డిమాండ్, సప్లయి వగైరాల వలలో చిక్కిన సామాన్యుడు బావురుమంటున్నారు. కరోనా మహమ్మారి కోరల నుంచి తప్పించుకున్నామని. ఇప్పుడే కోలుకుంటున్న సగటు వినియోగదారుడు ధరల సెగ నుంచి రక్షణ కోసం అర్రులు చాస్తున్నాడు. కష్టజీవులు.. ముఖ్యంగా బడుగు వర్గాల వారు వారాంతంలో మాంసాహారానికి తహతహలాడుతారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎంతో కొంత తమ ఆహార అలవాట్లలో మాంసాహారానికి ప్రాధాన్యమిస్తారు. కానీ అనూహ్యంగా వారు ధరాఘాతంతో ఆదివారాలు ఆహార అసంతృప్తిని మిగిల్చుతున్నాయి. ముఖ్యంగా చికెన్ ధరలు ఎగబాకాయి. అతి స్వల్ప వ్యవధిలో కిలోకు రూ.300 పైగా చేరుకున్నాయి. దీనికి రకరకాల కారణాలు హేతువయ్యాయి. ఇక మార్కెట్లో మటన్ ధరలు సైతం రమారమి రూ.1000కు చేరుకోవడంతో ఎక్కువ శాతం మంది చికెన్ తినేందుకు నియంత్రించుకున్నారు. కొనలేక, తినలేక అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల కాలం వరకూ కిలో చికెన్ రూ.200 ఉండటంతో చికెన్ బాట పట్టారు. అదే కూర ఇప్పుడు రూ.100 పైబడి అదనంగా పెరిగింది. ఎక్కువ వాడకం ఉన్న స్కిన్లెస్ గత నెల వరకు రూ. 180 దాకా ఉండగా ఇప్పుడది. రూ. 300 దాటేసింది. స్కిన్ చికెన్ రూ. 160 నుండి 250 కు చేరగా, లైవ్ కోడి దాదాపు రూ. 200 అయింది. ధరల మంటపై పలు విశ్లేణలున్నాయి గత 3 నెలల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక కోళ్ళు బరువు పెరగడం లేదని, ఎండ వేడికి చనిపోతున్నాయని పౌల్ట్రీ వర్గాలు వివరిస్తున్నాయి. ఎండ వేడికి వేసవి కాలంలో కోళ్లు చనిపోతాయని, అందుకే రైతులు... కోళ్లు బలిష్టంగా తయారు కాక మునుపే అమ్మేస్తారని దాంతో సమ్మర్లో చికెన్ రేట్లు తగ్గుతాయని.. అయితే ఈ సీజన్లో చికెన్ రేట్లు అమాంతం పెరిగాయని, ఇది అనూహ్య పరిణామమని పౌల్ట్రీ నిపుణులు విశదీకరిస్తున్నారు. ఉత్పత్తి మందగించి సరఫరా తగ్గటంతో చికెన్ ధరలు పెరిగాయని వారంటున్నారు. మామూలుగా రైతులు... ఏడాదికి ఆరు బ్యాచ్ బ్రాయిలర్ కోళ్లను ఉత్పత్తి చేయాల్సి ఉండగా ప్రస్తుతం బ్యాచులనే తీస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో బ్యాచ్ ఎదగటానికి 15 రోజులు సమయం పడుతుంది. బ్యాచ్ బ్యాచ్‌కు మధ్య 15 రోజులు వ్యవధి ఉంటుంది. కానీ ప్రస్తుతం కంపెనీలు ఈ వ్యవధిని 45 రోజుల నుంచి 50 రోజులకు పెంచుకున్నట్లు వినిపిస్తోంది.
ఇమ్యూనిటీ పెరిగేందుకు..
మరోవైపు కోళ్లదాణా కిలో రూ.26 నుంచి రూ.50 వరకూ చేరింది. చేపల కంటే చికెన్ వాడకం అధికంగా ఉండటం. పైగా కోడి మాంసం డిమాండ్ అధికంగా ఉండటం.. ఆ డిమాండ్‌కు తగ్గట్టు సప్లై చేయడానికి పౌల్ట్రీలో కోళ్ళ మరణాలు ఎక్కువయ్యావని, అలాగే సముద్రంలో చేపల వేట నిషేధం ఉండటం వంటివి చికెన్ వాడటానికి హేతువైంది. ఇలా జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నట్లు కొందరు విశ్లేషకులు వివరిస్తున్నారు. చికెన్ ధరతోపాటు కోడిగుడ్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. గతనెలలో పాతిక గుడ్లు 100 నుంచి 110 రూపాయలు పలకగా ఇప్పుడు ఏకంగా ఇంచుమించు రూ.150కి చేరింది.
వాస్తవానికి కరోనా కాలంలో వైరస్‌పై రకరకాల ప్రచారాలు సాగటంతో ధరలు కిలోకు రూ. 40కు కూడా పడిపోయిన దాఖలాలున్నాయి. ఇప్పుడు జన జీవనం సాఫీగా సాగిపోతుండటంతో సకల జనులు మునుపటిలా ఆహార అలవాట్లకు మారిపోయారు. కరోనా తర్వాత పౌష్టికాహారానికి ప్రాధాన్యతనివ్వాలని వైద్యులు పదేపదే సూచనలు ఇవ్వడం... తద్వారా ఇమ్యూనిటీ పెరిగేందుకు చికెన్, ఇతర మాంసకృతులు దోహదం చేస్తాయని చెప్పడంతో జనం యధావిధిగా ఆహార అలవాట్లకు దగ్గరయ్యారు. మటన్ ధరలు ఎక్కువవ్వడం, ధరల దండయాత్రతో చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక వ్యాపారులు ఉత్పత్తి వ్యయం ఎక్కువయిందని అందుకే కొత్తగా పిల్లలను పెంచడం లేదని, పైగా వర్షాలు లేకపోవడం, గాలిలో తేమ తగ్గడం కోళ్ళ ఎదుగుదలలో తీవ్ర ప్రభావం చూపింది. అందుకే కోళ్ళు మేత తక్కువగా తిని, ఎక్కువగా నీళ్ళపై ఆధారపడడంతో కోళ్ళు అనుకున్నంత బరువు పెరగడం లేదని చెబుతున్నారు. ఇక రైతులేమో,
కోళ్ళ పరిశ్రమలో 80% నుండి 85% వాటా కంపెనీలదేనని, మిగిలిన 15-20 శాతమే రైతులున్నారు. రైతులు కోళ్ళు పెంచి కంపెనీలకు అందజేస్తుంటారు. కోళ్ళ ధరలు నిర్ణయంలో కంపెనీలదే కీలక భూమిక కావడంతో, మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారని వివరిస్తున్నారు.
చెన్నుపాటి రామారావు,
9959021483