- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిధాన్యాలు ఆరోగ్య సిరులు
గత ఐదేళ్లుగా ఇక్రిశాట్ నిర్వహించిన 'స్మార్ట్ ఫుడ్ ఇనిషియేటివ్-2021' అధ్యయనాలలో సిరిధాన్యాల వాడకంతో మధుమేహమే కాకుండా రక్తహీనత, ఐరస్ పోషక అవసరం, కొలెస్టరాల్, కార్డియో వాస్క్యూలార్ వ్యాధులు, కాల్షియం, జింక్ ధాతులోపాలపై మెటా-విశ్లేషణలు చేయడం సంతోషదాయకం. మనకు అందుబాటులో ఉన్న 11 రకాల మిల్లెట్స్‌లో జీఐ 55 నుంచి 69 వరకు ఉండడం గమనించబడింది. ఆరోగ్య ఆహారంగా సిరిధాన్యాలను స్మార్ట్-ఫుడ్‌గా గుర్తించి బియ్యం, గోధుమలు, మక్కల వాడకాన్ని తగ్గించి, జీవనశైలి మార్పులను ఒంటబట్టించుకుని మధుమేహం లేని మానవ సమాజాన్ని నిర్మించుకుందాం.
సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నవారిలో టైప్-2 మధుమేహ సమస్యలు తగ్గుతున్నాయని, మధుమేహం లేనివారిలో బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రించబడుతోందని 'ఫ్రాంటీయర్స్ ఇన్ న్యూట్రిషన్' పరిశోధన పత్రికలో అచ్చయిన వ్యాసం వివరిస్తున్నది. వీటిని తీసుకోవడం వలన మధుమేహ సమస్యలు రాకుండా నిరోధించవచ్చని యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఎన్‌ఐఎన్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్), ఇక్రిసాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి-అరిడ్ ట్రోపిక్స్) సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనా ఫలితాలను ఈ పత్రిక ప్రచురించింది.
ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో జరిపిన పరిశోధనలలో మిల్లెట్స్‌ను ప్రధాన ఆహారంగా వాడడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12 నుంచి 15 శాతం తగ్గుతూ, డయాబెటిస్ సమస్య లేకుండా పోతోందని తేలింది. సిరిధాన్యాలు తీసుకునేవారిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) నియంత్రించబడుతూ, హిమోగ్లోబిన్‌ను అంటుకొని ఉండే బ్లెడ్ గ్లూకోస్ (హెచ్‌బీఏ1సి) స్థాయి 17 శాతం వరకు పడిపోయి షుగర్ సమస్య దూరం అవుతుందని గుర్తించారు.
ఏకైక మార్గంగా
దాదాపు 80 మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలను సవిరంగా సమీక్షించి, పరిశీలించి మిల్లెట్స్‌ను స్మార్ట్ ఫుడ్ జాబితాలో చేర్చాలని సలహా ఇచ్చారు. గతంలో పలు ప్రాంతాలలో మిల్లెట్స్‌తోపాటు జొన్నలను కూడా తీసుకునే అలవాటు ఉండేది. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ప్రాధాన్యత పెరిగిన తరువాత సిరిధాన్యాల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఎక్కువ మంది ప్రజలు మధుమేహ సమస్యలతో బాధపడుతున్నారు. ఆఫ్రికా దేశాలలో 2019 నుంచి 2045 వరకు మధుమేహ సమస్య 143 శాతం, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికాలో 96 శాతం, సౌత్ ఈస్ట్ ఏసియాలో 74 శాతం పెరగవచ్చని అంచనా వేశారు.
దీంతో మధుమేహ నియంత్రణకు ఏకైక సులభమార్గం సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా వాడకమే అని తెలుస్తున్నది. మిల్లెట్స్‌లో జీఐ 52.7 ఉంటుందని, బియ్యం, గోధుమలతో పోల్చితే 36 శాతం, మొక్క జొన్నతో పోల్చితే 14-37 జీఐ తక్కువగా ఉంటుందని తెలుస్తున్నది. మిల్లెట్స్‌ను ఉడికించిన తరువాత కూడా జీఐ విలువ బియ్యం, గోధుమలు, మక్కల కన్నా తక్కువగానే ఉంటుందని వివరించారు. జీఐ విలువను బట్టి బ్లడ్ షుగర్ లెవల్స్ ఎంత వరకు, ఎంత తొందరగా పెరుగుతాయో తెలుస్తుంది. మధుమేహ అదుపుకు జీవనశైలి మార్పులు, తీసుకునే ఆహార పదార్థాల స్వభావం లాంటివి దోహదపడతాయి.
వాతావరణ మార్పులకు సమాధానంగా
ప్రపంచంలో నేడు 463 మిలియన్ల మధుమేహ రోగులు ఉన్నారు. 2045 నాటికి 700 మిలియన్లకు చేరవచ్చని అంచనా. ప్రపంచంలోని ప్రతి ఆరుగురు మధుమేహ రోగులలో ఒకరు భారతీయులు ఉంటారు. చైనాలో 116 మిలియన్లు, ఇండియాలో 77 మిలియన్లు, యుఎస్‌లో 31 మిలియన్లు, పాకిస్తాన్‌లో 19 మిలియన్లు, బ్రెజిల్‌లో 17 మిలియన్లు, మెక్సికోలా 13 మిలియన్లు, ఇండోనేషియాలో 11 మిలియన్ల ప్రజలు మధుమేహ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రపంచ దేశాలలో ఒకవైపు పోషకాహార లోపం, మరోవైపు అధిక పోషకాహార లభ్యత లాంటి సమస్యలు జీవనశైలి రుగ్మతలకు కారణం అవుతున్నాయి. పోషకాహార లోపం, ప్రపంచ ఆరోగ్య సంక్షోభం, ప్రకృతి వనరుల విచ్ఛిన్నం, వాతావరణ మార్పులకు సమాధానంగా సిరిధాన్యాల వాడకం ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
గత ఐదేళ్లుగా ఇక్రిశాట్ నిర్వహించిన 'స్మార్ట్ ఫుడ్ ఇనిషియేటివ్-2021' అధ్యయనాలలో సిరిధాన్యాల వాడకంతో మధుమేహమే కాకుండా రక్తహీనత, ఐరస్ పోషక అవసరం, కొలెస్టరాల్, కార్డియో వాస్క్యూలార్ వ్యాధులు, కాల్షియం, జింక్ ధాతులోపాలపై మెటా-విశ్లేషణలు చేయడం సంతోషదాయకం. మనకు అందుబాటులో ఉన్న 11 రకాల మిల్లెట్స్‌లో జీఐ 55 నుంచి 69 వరకు ఉండడం గమనించబడింది. ఆరోగ్య ఆహారంగా సిరిధాన్యాలను స్మార్ట్-ఫుడ్‌గా గుర్తించి బియ్యం, గోధుమలు, మక్కల వాడకాన్ని తగ్గించి, జీవనశైలి మార్పులను ఒంటబట్టించుకుని మధుమేహం లేని మానవ సమాజాన్ని నిర్మించుకుందాం.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 99497 00037