- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత పెన్షన్ కావాలె!
మన దేశంలో ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు ప్రకటించడం ప్రభుత్వం వంతైతే వాటిని ప్రజల చెంతకు చేర్చేది మాత్రం ప్రభుత్వ యంత్రాంగమే! పథకాలన్నీ ప్రజలకు సరైన విధంగా చేరి, వారికి లబ్ధి చేకూర్చేలా చేసేది ప్రభుత్వ ఉద్యోగులే. కానీ అలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శీతకన్ను ఎందుకో..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పాలిట మిత్రుడు అనే నానుడిని నిజాన్ని చేస్తూ ఉద్యోగులకు యూపీఏ-1 ప్రభుత్వం 2006లో ఆరవ వేతన సంఘం నిర్ణయించిన వేతనాలను అమల్లోకి తీసుకురావడంతో నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నడూ లేనంతగా సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత 2016 లో ఇవ్వవలసిన వేతన సవరణను బీజేపీపై ప్రభుత్వం 2017 జూలైలో ఇవ్వడం జరిగింది, కానీ ఈ వేతన సవరణపై ఉద్యోగులు ఎంతో నిరాశ చెందారు.ఇక ఇప్పుడు ఎనిమిదవ వేతన సవరణ సంఘం నియమించాలని, 2026 జనవరి నెల నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సమాఖ్యలు వినిపించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోవడం ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహలను నింపుతున్నాయి.
ఎడారిలో ఓయాసిస్‌లా…
నూతన పెన్షన్ విధానాన్ని అమలుపరిచిన బీజేపీపై రోజురోజుకు ఉద్యోగులలో వ్యతిరేకత పెరిగిపోతున్నది. 2004లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానంలో ఉద్యోగం పొందిన వారు ఇప్పుడిప్పుడే పదవీ విరమణ పొందడం, వారికి వస్తున్న పెన్షన్ చూసి ఉద్యోగులు షాక్ కు గురవుతున్నారు. దీంతో బీజేపీపై వ్యతిరేకత పెరిగి, ఎవరైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారో వారికి మా మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నారు.
గత సంవత్సరన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల హామీలో చెప్పి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి సైతం తీసుకువచ్చింది. దీంతో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎడారిలో ఓయాసిస్‌లా కనిపించింది. ఇప్పుడు మనం పోరాటం చేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని పెడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.
నిరవధిక సమ్మె యోచనలో..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఉద్యమ కార్యాచరణను ఎత్తుకున్నారు. 2024 ఫిబ్రవరి 28న బుధవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌జేసిఏ, జెఎఫ్‌ఆర్, ఓపిఎస్ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి రైల్వే కార్మికులు నిరవధిక సమ్మె నోటీసును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నోటీసును మార్చి 19న సంబంధిత జనరల్ మేనేజర్ కు ఇవ్వాలని 1 మే 2024 నుండి నిరవధిక సమ్మె చేయాలని, ఎలాగైనా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగస్తులందరికీ పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
- రాజ్ కుమార్ పాక
INTUC జిల్లా జనరల్ సెక్రెటరీ, వరంగల్
95533 33838