- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిపై విచారణ జరిపించాలి!
ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా అవినీతిని ఊడ్చేస్తానని ప్రగల్భాలు పలికిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అందుకు విరుద్ధంగా దేశవ్యాప్తంగా అవినీతిని విస్తరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చేస్తానని చెప్పి తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్ మోడీపై విమర్శలు చేస్తున్నారు. అయితే తమ ప్రధాన శత్రువైన మోడీపై దెబ్బకొట్టేందుకు, అవినీతి వ్యాపారాల్ని కాపాడుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కటైన క్రమంలో 75 కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు అనిపిస్తుంది. అవినీతిపై పోరాటం చేస్తానని ఢిల్లీలో అధికారంలోకి వచ్చి కేజ్రీవాల్ తీరా తానే అవినీతికి చిరునామాగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే కేసీఆర్ పై సైతం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర అనేక అవినీతి ఆరోపణలు గుప్పుమంటూనే ఉంటాయి. గత కొన్నేళ్లుగా కేసీఆర్, కేజ్రీవాల్‌ల మధ్య ఉమ్మడి వ్యాపారాలు, ఉమ్మడి పెట్టుబడులు కొనసాగినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికి తోడు ఇప్పుడు సుఖేష్ చంద్రశేఖర్ కేజ్రీవాల్ సూచన మేరకే అప్పటి టీఆర్ఎస్ పార్టీకి 75 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించడంతో వీరి సంబంధాలు నిజమేననిపిస్తుంది. అందుకే వీరి మధ్య ఉన్న చీకటి సంబంధాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ చేయించాల్సిన అవసరం ఉంది.
పసునూరి శ్రీనివాస్
8801800222