- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుల గణన దేశ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం
దేశ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసేదే కుల గణన. ఇది దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వం 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేసి పేదలను, వెనుకబడిన కులాలను వృద్ధి ప్రక్రియలతో మమేకం చేయాలి. కుల గణనను పేదరిక కోణం నుంచి చూడాలి. అప్పుడు ఎవరికీ ఏమీ అభ్యంతరం ఉండదు. కులగణన వలన అందరి అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. నిరుపేద వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం సంపద, ఉద్యోగం, రాజకీయ అవకాశాల్లో వారి వాటా వారికి దక్కినప్పుడు దేశ అభివృద్ధి అందరిదీగా ఉంటుంది.
అనేక గణాంక వివరాల ప్రకారం, కుల సంఘాల ప్రకారం దేశంలో 80% జనాభా ప్రభుత్వ రాయతీలతో అభివృద్ధికి రావాలని తాపత్రయపడుతున్నారు. లోపభూయిష్టమైన వృద్ధి ఫలితం ఇది. ప్రభుత్వ ఉద్యోగాలు ఘనంగా తగ్గిపోయాయి. పేదరికం పెరిగిపోయింది. కులాల గణాంకాలు తెలియకపోతే పేదరికం. నిరుద్యోగాన్ని అంచనా వేయలేము. అందుకే కుల గణన తెలంగాణలోనే కాకుండా దేశమంతటా నిర్వహించడమే ఈ సమస్యకు పరిష్కారం.
గణంకాలు తెలియకపోతే..
చక్రవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు లాగా నేడు ప్రభుత్వాల గతి ఉంటోంది. ఇటు రాజ్యాంగం, అటు ప్రజాస్వామ్యం వైఫల్యంతో దేశంలో 80 శాతం మంది తమను ఆదుకోవాలని అంటున్నారు. ప్రజల ఈ దుస్థితిని మార్చాలి. కులం వర్గం ఒకటిగా ఉన్న మన సమాజాన్ని సమ సమాజంగా ఎలా మార్చేది? నిలువునా చీలిన సమాజాన్ని సమాంతర పరిచేది ఎవరు? కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలియకుంటే ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ఉపాధి అవకాశాలు ఎలా పేదలకు చేరుతాయి? 78 వసంతాల స్వాతంత్ర్య భారతావనిలో ఏ కులం వారు ఏ మేరకు ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందారు? అసలు అభివృద్ధిలో పాలుపంచుకున్నారా? లేదా అని తెలుసుకోవడం తక్షణావసరం. కులాల గణాంకాలు తెలియకపోతే పేదరికం నిరుద్యోగాన్ని అంచనా వేయలేము. ఇంకా కొన్ని కులాలే సమాజాన్ని శాసిస్తు న్నాయన్న వాదన వాస్తవం అవునా కాదా తేల్చకపోతే సమాజం సంఘర్షణకు లోనై దేశం అస్తవ్యస్తమైపోయే ప్రమాదం ఉంది. దేశ ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ జన గణన మాదిరిగానే మిగతా కులాల జనాభా లెక్కల సేకరణ కూడా జరగాల్సి ఉంది.
కొందరి అభివృద్ధి వద్దు!
దేశంలోని సుమారు 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారు. వీరికి నిరుద్యోగం చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ అలా జరగలేదు. దేశంలో నిరుద్యోగం పరిష్కారానికి వృద్ధిరేటు పెంపుదలకు దారి ఏమిటో చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. నేడు దేశంలో ఆర్థిక వృద్ధి కొందరిదిగానే ఉంది. అది అందరిదీ కావాలంటే కులగణన చేసి పేదలను గుర్తించి వారిని వృద్ధి ప్రక్రియలో మమేకం చేయాలి గాని ఉచితాలతో నోరు ఊరించే వారి భవిష్యత్తును నిర్వీర్యం చేయకూడదు. కుల వ్యవస్థ వివక్ష వల్లే దేశంలో అసమానతలు ఉన్నాయి. అసమానతల వలన ప్రజల కొను గోలు శక్తి అత్యల్ప స్థాయిలో ఉంది. దీని వలన వృద్ధి ప్రక్రియ పురోగమనంలో లేదు. ఇది దేశ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేస్తుంది.
పాలకులు కుల పెద్దలైతే ఎలా?
అలాగే దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వృత్తి కులాల జనాభా ఎంతో, వారి స్థితిగతులు ఏమిటో జనాభాలో అత్యధికంగా ఉన్నా, అధికారంలో మాత్రం తమ వాటా దక్కకపోవడంలోని అంతరం ఏమిటో, ఈ దోపిడీ అంతు తేల్చాలంటే కులాల వారీగా సమగ్ర జనగణన సేకరణ అత్యంత ఆవశ్యంగా గుర్తించాలి. లేకపోతే ప్రభుత్వాలు అగ్ర వర్ణాల ప్రభుత్వాలుగా మిగిలిపోతాయి. ఏ కులం ప్రజలు తాము అభివృద్ధి చెందలేదని వాపోతున్నారో తెలుసుకుని చేయూతనివ్వాలి. అంతేగాని కులాల మధ్య చిచ్చు పెట్టే రిజర్వేషన్ రాజకీయాలతో రాజకీయ పదవులకు పాలకులు ఆశపడితే సమాజం సంఘర్షణకు లోనై శాంతిభద్రతలు లోపించి అభివృద్ధి కుంటుపడుతుంది. మానవ అభివృద్ధి అంటే అన్ని కులాల అభివృద్ధి ముఖ్యమే కదా. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కులాల పెద్దలుగా ఉండక సామాజిక పెద్దలుగా ఉండాలి. కుల రాజకీయాలు చేయకూడదు. కొన్ని కులాలను వెనుకబడిన తరగతులు చేర్చడం, మరలా తీసేయడం వల్ల వారు అధోగతి పాలయ్యారు.
నిరుపేదలు ఎవరో తేల్చాలి..!
దేశంలో ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులు ఉన్నాయో తేలాలి. కొన్ని సర్వేల ప్రకారం మన దేశంలో ఉన్నత ఆదాయ వర్గాలకు చెందిన ఒకే ఒక శాతం చేతిలో 40 శాతం పైగా సంపద ఉన్నది. ఇలాంటి అసమానతలు తొలగించాలంటే దేశ సంపద అందరికీ చెందాలంటే రిజర్వేషన్ పరిమితి 50% తొలగించి పేదలకు అందే విధంగా రిజర్వేషన్లు పెంచి తద్వారా దేశాభి వృద్ధిలో అందరూ పాలుపంచుకునే విధంగా ఉండాలి. లేనియెడల సాంఘిక సంఘర్షణకు దారితీస్తుంది. ప్రభుత్వాలు జాగ్రత్తగా రాజ్యాంగ పరిమితులకు లోబడి ముందుగా నిరుపేదలు ఎవరో తేల్చాలి. ఇప్పటివరకు జరిగిన అభి వృద్ధిలో బాధితులు ఎవరో తేల్చాలి వారికి భవిష్యత్తు భరోసా కల్పించాలి. అదే దేశాభివృద్ధి అజెండాగా ఉండాలి. కులగణన లెక్కల సేకరణ కాకూడదు. సమ సమాజం వైపు దేశాన్ని నడిపించేదిగా కులగణన దోహదపడాలి.
ఇకపై తాత్సారం వద్దు!
దేశ అభివృద్ధిలో ఎవరు పాలుపంచుకుంటున్నారో లేరో తెలిసేది కుల గణనలతోనే అని ఎప్పటినుంచో ఎందరో చెబుతుంటే ప్రభుత్వాలు తాత్సారం ఎందుకు చేస్తున్నాయి? దేశంలో ఎవరు ఏ మేరకు స్వదేశీ పాలనలో అభివృద్ధి ఫలాలు అందుకున్నారు? ఎవరు అభివృద్ధిలో సమ్మిళితమైనారు. అభివృద్ధి ఫలాలు ఎవరు పొందలేకపోయారు? ఇలాంటి వాటిని అంచనా వేయడానికి కులాలవారీగా జనాభా సేకరణ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడితే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకు వీలవుతుంది. విభజించు పాలించు విధానంతో కులాల మధ్య చిచ్చు పెడుతూ, మతాల మధ్య చిచ్చుపెడుతూ పాలన సాగించే విధానానికి స్వస్తి చెప్పి కుల, జనగణ సేకరణను చేపట్టడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. కులం అనేది సామాజిక వర్గం అది వెనకబడిపోతే ఆర్టికల్ 16 (4) ప్రకారం ప్రభుత్వం వెనుకబడిన కులంగా ప్రకటించాలి ఆర్టికల్ 15(4), 15(5) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రభుత్వాలు సహాయ సహకారం అందించి అభివృద్ధి పరచాలి.
డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
98663 22172