ఏజెన్సీలోని మాదిగలను ఆదుకోవాలి

by Ravi |   ( Updated:2023-02-24 01:37:07.0  )
ఏజెన్సీలోని మాదిగలను ఆదుకోవాలి
X

జెన్సీ ప్రాంతంలో శతాబ్దం నుండి ఆదివాసీలతో పాటు జీవనం కొనసాగిస్తున్నారు మాదిగ సామాజిక వర్గం వారు. ఆదివాసీల వలె వీరు కూడా ఆడవిలో దొరికే వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ సామాజిక వర్గం పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసీలకు వ్యవసాయ పనిముట్లు తయారుచేసి ఇచ్చేవారు. అలాగే చనిపోయిన పశువుల చర్మంతో చెప్పులను తయారుచేసి ఇచ్చేవారు. ఈ పనికి ఆదివాసీలు డబ్బులు కాకుండా వారు పండించిన పంటలో కొంత వీరికి ఇచ్చేవారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని నిల్వచేసుకుంటూ ఆదివాసీలతో పాటు ఆ గూడెంలోనే జీవించేవారు. అలాగే వారి పండగలకు డప్పులు వాయించేవారు. నాలుగు తరాలుగా ఆదివాసీల ఆచార వ్యవహారాలను పాటిస్తూ జీవిస్తున్నారు. వారి దేవతలైన సమ్మక సారక్కల పండగకు డప్పు కొట్టేది ఈ సామాజిక వర్గం వారే. ఏజెన్సీ ప్రాంతంలో నాటి నుండి నేటి వరకు ఆదివాసి గూడెం ఎక్కడ ఉంటే అక్కడ మాదిగల గుడిసెలు నేటికీ ఉన్నాయి. అదివాసీల జీవనానికి అనుగుణంగా గత వందేళ్ల నుండి జీవనం చేస్తున్న మాదిగలకు, ఆదివాసీల వలె పోడు వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమి కల్పించి వారి జీవన విధానానికి సహాయం చేయాలని కోరుతున్నాం.

గుగ్గిళ్ళ వెంకన్న

93980 34022

Also Read...

తపాలా శాఖ సేవలు పెంచాలి


Advertisement

Next Story

Most Viewed