- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సౌత్' ఎంట్రీకి 'ఆప్' తహతహ
ఆప్ అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తన బేస్‌ను పటిష్టం చేసుకుంటున్నది. అందుకు తెలంగాణ సరైనదిగా భావించింది. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ ప్రజలలో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నది. సౌత్ ఇండియాలో ఎంట్రీకి తెలంగాణను 'గేట్ వే' గా భావిస్తున్నది. అందుకే ఆప్ దక్షిణ భారత ఇన్‌చార్జి సోమ్‌నాథ్ భారతి తెలంగాణ రాష్ట్రం పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పటి నుంచి తన మద్దతు తెలియజేస్తునే ఉన్నారు. అలాగే ఆయనకు తెలంగాణ ప్రాంతం పైన, ప్రజలపైనా లోతైన అవగాహనే ఉన్నది. అందుకే ఆయనను తెలంగాణకు ఇన్‌చార్జిగా నియమించడం ఆప్‌కు కలిసొచ్చే అంశం.
దేశ రాజధాని ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ గెలుపుతో మంచి జోష్‌లో ఉంది. ఇదే ఉత్సాహంతో దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయాలని అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సౌత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని సారించి పాగా వేయాలని చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు అసలు సిసలైన ప్రత్యామ్నాయ పార్టీగా ఆప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో పార్టీ నిర్మాణాన్ని చేపడుతున్నది. విద్యార్థులు, యువత, మేధావులు, తటస్థులతో పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతానికి అయితే, ఏ రాజకీయ పార్టీతోనూ చర్చలు, సంప్రదింపులు, పొత్తు లేకుండా పుంజుకుంటున్నది.
ఆయన నియామకంతో
'ఆప్' అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తన బేస్‌ను పటిష్టం చేసుకుంటున్నది. అందుకు తెలంగాణ సరైనదిగా భావించింది. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ ప్రజలలో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నది. సౌత్ ఇండియాలో ఎంట్రీకి తెలంగాణను 'గేట్ వే' గా భావిస్తున్నది. అందుకే ఆప్ దక్షిణ భారత ఇన్‌చార్జి సోమ్‌నాథ్ భారతి తెలంగాణ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పటి నుంచి తన మద్దతు తెలియజేస్తునే ఉన్నారు. అలాగే ఆయనకు తెలంగాణ ప్రాంతం పైన, ప్రజలపైనా లోతైన అవగాహనే ఉన్నది. అందుకే ఆయనను తెలంగాణకు ఇన్‌చార్జిగా నియమించడం ఆప్‌కు కలిసొచ్చే అంశం.
పార్టీ పటిష్టత కోసం ఇప్పటికే ఢిల్లీ వేదికగా తెలంగాణకు చెందిన పలువురితో చర్చలు జరిపి, కలిసివచ్చే పార్టీల మద్దతు కోసం సమావేశాలనూ నిర్వహించారు. ఆ క్రమంలోనే తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం కూడా తన పార్టీని విలీనం చేస్తారనే వార్తలు వచ్చాయి. స్వయంగా సోమ్‌నాథ్ తెలంగాణలో పర్యటించి తాజా రాజకీయ పరిస్థితులను తెలుసుకుని పార్టీ తరఫున అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే పాదయాత్రకు అధినేత కేజ్రీవాల్ ను ఆహ్వానించాలనుకున్నారు. కానీ, పంజాబ్‌లో తమ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడి వ్యవస్థను సరిదిద్దడానికి కాస్త సమయం తీసుకోవడంతో తెలంగాణ పర్యటనకు రాలేకపోయారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ
తెలంగాణలో పాదయాత్ర అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభమైంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, అవినీతి, నిరుద్యోగం, విద్య-వైద్య రంగాల దయనీయ పరిస్థితి ఎత్తి చూపుతున్నారు. అందులో భాగంగానే గుడ్‌ఫ్రైడే రోజున క్రైస్తవులతో కలిసి సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధి నుంచి అబిడ్స్ వరకు జరిగిన ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో రానున్న ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.
ఇకపైన పార్టీ తరఫున విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టి పార్టీను మరింత బలోపేతం చేయాలనుకుంటుంది. గెలుపే లక్ష్యంగా కార్యచరణను రూపొందించుకుంటున్నది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీలైట్‌గా తీసుకున్నా 'గుడ్ ఫ్రై డే' ను ఆప్ బాగా ఉపయోగించుకున్నది. క్రిస్టియన్ల మనసు గెల్చుకున్నది. మేధావులు, విద్యాధికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉండగా వారి సహకారం ఏ మేరకు ఇస్తారనేది కాలమే తేల్చనున్నది. అలాగే, సికింద్రాబాద్, తిరుమలగిరి, బొల్లారం, కూకట్‌పల్లి, సనత్‌నగర్, అబిడ్స్ చర్చిలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ఆప్ శ్రేణులు పాల్గొన్నాయి. టీఆర్ఎస్ మీద ప్రజలలో ఉన్న అసంతృప్తి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆప్ అడుగు పెట్టడం, పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగకముందే ప్రజలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.
గంటెపాక శ్రీకాంత్
81849 45145