- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేవుణ్ణి నమ్మేవాడు కమ్యూనిస్టేనా?
కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్ముతారు' అంటూ సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. దేవుడు ఒక ఊహాజనితం అని నమ్మే కమ్యూనిస్టు ప్రాథమికంగా నాస్తికుడు, హేతువాది, మహిమలను నమ్మని తర్కబద్దుడు అని అందరూ అనుకుంటారు. దేవుడిపై విశ్వాసం గురించిన ఆయన సూత్రీకరణ వ్యక్తిగతమా లేక పార్టీ నియమావళినా అనేది స్పష్టం కావాలి. ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టులందరి తరఫున వకాల్తా తీసుకోని అలా మాట్లాడే అధికారం మాత్రం ఆయనకు లేదు. పార్టీ ఆయన మాటల్ని తమ విధానంగా అంగీకరిస్తే సీపీఐ ఆఫీసుల్లో దేవుని గదిని పెట్టించి అయ్యవార్లతో పూజలు జరిపించాలి. మతం మనుషులను విడదీస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని, పార్టీకి ఉండే గతితార్కిక పద్ధతిని చాడ విస్మరించారు. మతంపై విశ్వాసం ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది కావచ్చు. కానీ దేవుళ్ళకు 'కమ్యూనిస్టులు' వ్యతిరేకం కాదు అనే మాట సర్వాంగీకారం కాదు. ఆ మాట కమ్యూనిస్టు అనే భావనకే మచ్చ లాంటిది. సిద్ధాంత నియమాల ప్రకారం తాను కమ్యూనిస్టునా కాదా అనేది కూడా ఆయన తేల్చుకోవాలి. సిపిఐలో దేవుని నమ్మేవారు, నమ్మనివారు ఎవరో తేలాలి. అందరు నమ్మేవాళ్లే అయితే పార్టీ పేరులో కమ్యూనిస్టు అనే పదం తొలగిస్తే మంచిది.
ఈ మధ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఒక దేవాలయంలో మొక్కులు చెల్లించుకొని, పూజారితో ఆశీర్వచనాలు తీసుకుని ఆ తరవాత పత్రికలవారితో 'దేవుళ్ళకు కమ్యూనిస్టులు వ్యతిరేకులు కారని, తాము భగవంతుడిని నమ్ముతామని' అన్నారు. ఆయన మాటల ప్రకారం ఇది తమ పార్టీ విధానం అన్నట్లుగా అర్థమిస్తోంది. దేవుడు ఒక ఊహాజనితం అని నమ్మే కమ్యూనిస్టు ప్రాథమికంగా నాస్తికుడు, హేతువాది, మహిమలను నమ్మని తర్కబద్దుడు అని అందరూ అనుకుంటారు. అలాగే మన దేశంలోని కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న చాలా మంది ముహుర్తాలు లేకుండా, పెళ్లి మంత్రాల తంతు లేకుండా ఆదర్శ వివాహాలు చేసుకున్న సందర్భాలున్నాయి. అదే విధంగా తమ వారి మృతదేహాలకు కర్మకాండలు పాటించకుండా హాస్పిటళ్ళకు అప్పగిస్తున్న వారున్నారు. ప్రజోద్యమాలకు కాలం సహకరించకున్నా వ్యక్తిగతంగా కనీసం వీటిని పాటిస్తూ తమలోని కమ్యూనిస్టు భావనలను నిలుపుకుంటున్నారు.
ఈ క్రమంలో వెంకట్ రెడ్డి నోట వచ్చిన 'కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్ముతారు' అనే మాటలు ఆశ్చర్యం గొల్పాయి. అయితే ఆయన సూత్రీకరణ వ్యక్తిగతమా లేక పార్టీ నియమావళినా అనేది స్పష్టం కావాలి. ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టులందరి తరఫున వకాల్తా తీసుకొని అలా మాట్లాడే అధికారం మాత్రం ఆయనకు లేదు. అసలు ఆయన దృష్టిలో కమ్యూనిస్టులంటే కేవలం సిపిఐ సభ్యులా లేక కమ్యూనిజాన్ని ఆచరించే వారందరూనా అనేది తేలాలి.
కమ్యూనిస్ట్ పార్టీ తరపున కాకుండా వ్యక్తిగతంగా తనకు భగవంతుడిపై విశ్వాసముంది అంటే కొంతవరకు సర్దుకోవచ్చు. ఆయన వ్యాఖ్యపై ఇంతవరకు సిపిఐ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మౌనం వహిస్తోంది. పార్టీ ఆయన మాటల్ని తమ విధానంగా అంగీకరిస్తే పార్టీ ఆఫీసుల్లో దేవుని గదిని పెట్టించి అయ్యవార్లతో పూజలు జరిపించాలి. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే మతోన్మాదులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పనిచేస్తారని చాడ అన్నారు. మతంలో సామాన్యులు, ఉన్మాదులు ఉన్నారని విడదీశారు. మతం మనుషులను విడదీస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని, పార్టీకి ఉండే గతితార్కిక పద్ధతిని విస్మరించారు. చాడ వెంకట్ రెడ్డి మతాన్ని ఆచరించే సామాన్యుడి జాబితాలో ఒకరిగా కొనసాగవచ్చు. అది ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినది. ఎవరు దానికి అభ్యంతరం చెప్పారు. కానీ దేవుళ్ళకు 'కమ్యూనిస్టులు' వ్యతిరేకం కాదు అనే మాట సర్వాంగీకారం కాదు. ఆ మాట కమ్యూనిస్టు అనే భావనకే మచ్చ లాంటిది. సిద్ధాంత నియమాల ప్రకారం తాను కమ్యూనిస్టునా కాదా అనేది కూడా ఆయన తేల్చుకోవాలి.
కమ్యూనిజం అనేది ఒక సిద్ధాంతం. కమ్యూనిటీ అనగా అందరికి చెందినది అని అర్థం. భూమ్మీది వనరులన్నీ ఉమ్మడి యాజమాన్య ఆస్తిగా పరిగణించేదే కమ్యూనిజం. కార్ల్ మార్క్స్ తన 'దాస్ క్యాపిటల్' గ్రంథం ద్వారా చెప్పిన శ్రమ దోపిడీ వివరణల ఆధారంగా వస్తు ఉత్పత్తిలో శ్రామికుడి కృషికి సరిసమానంగా లాభాల్లోనూ భాగముండాలని, శ్రామికుడు, పెట్టుబడిదారుడు అనే రెండు వర్గాలు కలిసిపోయి వర్గ రహిత సమాజం ఏర్పడాలి అనేది ఆయన ఉద్దేశ్యం. అయితే అలాంటి సమాజాన్ని స్థాపించేందుకు శ్రామికులంతా ఒక్కటై ప్రస్తుత వ్యవస్థను కూలదోయాలి. ఆ సంఘటిత శక్తి ద్వారా ఏర్పడేదే కమ్యూనిస్ట్ పార్టీ.
కమ్యూనిజం గమనానికి భిన్నంగా మరోవైపు 20 వ శతాబ్దం ఆరంభం నుండి పారిశ్రామిక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత పెరిగింది. అభివృద్ధిలో పోటీ పడేందుకు కమ్యూనిస్టు దేశాలు కూడా పెట్టుబడి బాటలో నడుస్తున్నాయి. అయితే ఈ మార్పులన్నీ ఆయా దేశాల్లో పాలకుల ప్రాబల్యంతో వచ్చినవే తప్ప కమ్యూనిజం సిద్ధాంతానికి, సూత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. పుస్తకాల్లో ఉన్న సిద్ధాంతం అలాగే ఉంది. కమ్యూనిస్టు అనే పదానికి అర్థం మారలేదు. లేని దేవుణ్ణి పుట్టించి, కర్మ సిద్ధాంతాన్ని తలకెక్కించి, వర్ణవ్యవస్థని సృష్టించి, మూఢ విశ్వాసాలతో ప్రజలను మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న వర్గాలను ప్రశ్నించేవాడే కమ్యూనిస్టు అని లోక అభిప్రాయం.
దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి. అందులో సభ్యత్వముండగానే ఆ వ్యక్తి కమ్యూనిస్టు అయిపోడు. సిద్ధాంతాన్ని ఆచరణబద్ధంగా అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో పాటించలేకపోతే తాను కమ్యూనిస్టును అని కాకుండా ఆ పార్టీ సభ్యుడిని లేదా సభ్యురాలిని అని మాత్రమే చెప్పుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పార్టీ నియమాలకు బద్దులైనా వ్యక్తిగత జీవితం వారి ఇష్టం. మన దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్న దశలో చాడ వెంకట్ రెడ్డి మాటలు ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని మరింత దెబ్బ తీస్తాయి. ప్రత్యేకంగా తెలంగాణలోని సిపిఐ నిర్ణయాలన్నీ ఈ మధ్య రాజకీయ ప్రయోజనాన్ని ఆశించేలా దిగజారుడుగా ఉంటున్నాయి. ఎర్రజెండాకు పసుపు, గులాబీ రంగులు పూసి దాని రంగేంటో తెలియకుండా చేస్తున్నారు. దీనికి తోడు చాడ వారి శఠగోపం మరింత పలుచన చేస్తోంది. సిపిఐలో దేవుని నమ్మేవారు, నమ్మనివారు ఎవరో తేలాలి. అందరు నమ్మేవాళ్లే అయితే పార్టీ పేరులో కమ్యూనిస్టు అనే పదం తొలగిస్తే మంచిది.
బి నర్సన్,
9440128169
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
రాజుల సొమ్ము రాళ్లపాలు- సలహాదారులతో ఒరిగేదేమిటి?