- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువు మాయం..?
దిశ, తుర్కపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గోపాల్ పురం గ్రామంలో కబ్జాకు గురవుతున్న ఏడావుల చెరువును కాపాడాలని, అదేవిధంగా చెరువుల కబ్జాకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని గోపాల్ పురం గ్రామంలో కబ్జాకు గురవుతున్న ఏడావుల చెరువును తుర్కపల్లి మండల కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు తలారి అశోక్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించి సుమారు 3 ఎకరాల నిండు కుండ లాంటి ఏడావుల చెరువును జేసీబీలు, టిప్పర్లతో మట్టిని తెచ్చి నింపి చెరువును నామరూపాల్లేకుండా చేస్తున్న పనులను నిలిపివేయించామని తెలిపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే, సంబంధిత చెరువు కబ్జాకు పాల్పడుతున్నది ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. సంబంధిత రియల్ ఎస్టేట్ మాఫియాపై చర్యలు తీసుకోని పక్షంలో గ్రామ ప్రజలు, ఆయకట్టు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కోట సురేష్, భూక్యా రమేశ్ నాయక్, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.