- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2015 Telangana CASH for VOTE scam : ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్
దిశ, వెబ్‌డెస్క్: 2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. రేవంత్‌తో పాటు వేంకృష్ణ కీర్తన్‌రెడ్డి, సెబాస్టియన్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుల పాత్ర కూడా ఉందని ఈడీ పేర్కొంది. ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2015 మే 31న నామినేటెడ్ ఎమ్మెల్యే సీఫెన్‌సన్‌కి అతడి ఇంట్లోనే రూ.50 లక్షలు ఆఫర్ చేస్తూ రేవంత్ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి ఆడియో టేపులు కూడా తీవ్రంగా వైరల్ అయ్యాయి. సీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. దాదాపు ఆరేళ్ల పాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించి ఆధారాలతో ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.