ప్రైవేట్ పెట్టుబడులతో వృద్ధి సానుకూలం : ఆర్‌బీఐ గవర్నర్!

by Harish |
ప్రైవేట్ పెట్టుబడులతో వృద్ధి సానుకూలం : ఆర్‌బీఐ గవర్నర్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్నట్టు అనేక గణాంకాలు సూచిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మంగళవారం ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పండుగ సీజన్ కారణంగా గిరాకీ పెరుగుదల కీలక పాత్ర పోషించినట్టు అభిప్రాయపడ్డారు. వృద్ధి స్థిరంగా కొనసాగేందుకు ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగాల్సిన అవసరం ఉందని, దీనికి కావాల్సిన క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలని దాస్ తెలిపారు. ‘భారత్‌కు వృద్ధి పరంగా అత్యంత వేగంగా పుంజుకునే సామర్థ్యం ఉంది.

స్టార్టప్‌ల ఆవిష్కరణ, ప్రోత్సాహకాలు అందించడంలో భారత్ ముందుంది’ అని అన్నారు. కంపెనీ ఉపాధి సహా పెట్టుబడుల పెంపునకు కృషి చేయాలన్నారు. ఇటీవల కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు తీసుకున్న నిర్ణయంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆశిస్తున్నట్టు దాస్ చెప్పారు. ప్రైవేట్ వినియోగం ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా క్రిప్టోకరెన్సీ వల్ల ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్‌బీఐ తీవ్రంగా ఆలోచిస్తోందని, ఈ నేపథ్యంలో లోతైన, సమగ్రమైన చర్చలు నిర్వహించాలని దాస్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed