- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమిచ్చింది.. పర్యటనకొచ్చింది
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో పలు క్రికెట్ బోర్డులు ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయాయి. కొన్ని బోర్డులు ఇండియా వైపు చూస్తుంటే.. మరికొన్ని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వైపు చూస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ తర్వాత జరుగుతున్న తొలి సిరీస్‌గా ఇంగ్లండ్-విండీస్ ద్వైపాక్షిక సిరీస్ చరిత్రలో నిలిచిపోనుంది. అయితే, బ్రిటన్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో విండీస్ బోర్డు ఈ పర్యటనకు ఓకే చెప్పడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. తమకు రుణం మంజూరు చేయాలని ప్రస్తుత ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ కొలీన్ గ్రీవ్స్‌ను విండీస్ కోరింది. అయితే తమ దేశంలో మీ జట్టు పర్యటన ఖరారు చేస్తే తప్పకుండా రుణం మంజూరు చేస్తామని, ఇది ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు లాభదాయకమేనని చెప్పడంతో విండీస్ క్రికెట్ బోర్డు ఓకే చెప్పింది. ఒప్పందం మేరకు విండీస్ క్రికెట్ బోర్డు ఇటు ఇంగ్లాండ్‌లో దిగగానే ఈసీబీ 3మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.23కోట్లు) రుణం మంజూరు చేసింది. తమ ఆటగాళ్లను పంపాలన్నా డబ్బులు లేవని చెప్పడంతో ఈసీబీనే విండీస్ ఆటగాళ్ల కోసం చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలుస్తున్నది. ఈసీబీ అందించినది వడ్డీ రహిత రుణమని, ఐసీసీ నుంచి తమ వాటా రాగానే తిరిగి ఈసీబీకి చెల్లిస్తామని క్రికెట్ వెస్టిండీస్ సీఈవో జానీ గ్రేవ్ తెలిపారు.