మరో టెస్టు సిరీస్ రద్దు !

by vinod kumar |
మరో టెస్టు సిరీస్ రద్దు !
X

దిశ, స్పోర్ట్స్ :

కరోనా దెబ్బకు క్రమంగా క్రికెట్ సిరీస్‌లు ఒక్కోటి వాయిదా పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయిన క్రీడాలోకం మళ్లీ ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మరో మూడు నెలల వరకు క్రికెట్ ఆడే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక టోర్నీలు, లీగ్స్ వాయిదా పడ్డాయి. తాజాగా ఈ జాబితాలోకి వెస్టిండీస్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కూడా చేరింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి విండీస్ జట్టు జూన్ నెలలో ఇంగ్లాండ్ రావాల్సి ఉండగా.. కాగా, కొవిడ్-19 ప్రభావంతో ఈ సిరీస్ రద్దు చేశారు. యూరోప్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇంగ్లాండ్స్ అండ్స్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇప్పటికే పలు టోర్నీలను రద్దు చేసింది. జూన్‌లో కూడా ఈ వైరస్ ప్రభావం తగ్గే అవకాశం లేదని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ పర్యటన కూడా వాయిదా పడింది.

Tags: ECB, West Indies Cricket, Cricket, Test Series, Corona, Cancelled

Advertisement

Next Story

Most Viewed