ఏడేళ్ల తర్వాత మహిళా టెస్టు మ్యాచ్

by Shiva |
ఏడేళ్ల తర్వాత మహిళా టెస్టు మ్యాచ్
X

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెట్ జట్టు ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నది. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అక్కడ ఒక టెస్టుతో పాటు వన్డే, టీ20 సిరీస్ ఆడనున్నది. టీమ్ ఇండియా ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడటానికి రెండు రోజుల ముందు ఇండియా-ఇంగ్లాండ్ మహిళా జట్ల టెస్టు జరుగనున్నది. జూన్ 16 నుంచి నాలుగు రోజుల టెస్ట్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ జట్టు రెండేళ్ల తర్వాత టెస్టు ఆడనుండగా భారత మహిళా జట్టు ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నది. చివరి సారిగా 2014 నవంబర్‌లో మైసూర్‌లో దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో టెస్టు మ్యాచ్ ఆడింది. జూన్ 27 నుంచి మూడు వన్డేల సిరీస్, జులై 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది. కాగా, ఇంగ్లాండ్ మహిళా జట్టు భారతో సిరీస్ అనంతరం సెప్టెంబర్‌లో న్యూజీలాండ్ జట్టుతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనున్నది. అక్టోబర్‌లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నట్లు ఈసీబీ వెల్లడించింది.

Advertisement

Next Story