- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
72 గంటలకు ముందే ప్రచారం బంద్
కోల్‌కతా: కరోనా కేసులు పెరుగుతున్నందున పశ్చిమ బెంగాల్‌లో రాజకీయపార్టీల ప్రచారంపై ఆంక్షలు పెంచింది. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం నిలిపేయాలని ఆదేశించింది. గతంలో ఇది 48 గంటలుగా ఉండేది. ప్రచారానికి అనుమతి ఉన్న రోజుల్లో రాత్రి 7 గంటల వరకు క్యాంపెయిన్ ముగించాలని తెలిపింది. ఇంతకుముందు ఇది రాత్రి 10 గంటల వరకు ఉంది. తాజాగా, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు క్యాంపెయినింగ్‌పై బ్యాన్ విధించింది. అలాగే, ప్రచార కార్యక్రమాల్లో నిర్దేశిత కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా వ్యవహరించాలని, స్టార్ క్యాంపెయినర్‌లు అందుకు ఆదర్శంగా నిలవాలని పేర్కొంది. లేదంటే ఆ ర్యాలీలు, సభలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. కాగా, మిగిలిన విడతలను కుదించడంపై తన వైఖరిని మార్చుకోలేదు. షెడ్యూల్ ప్రకారమే ఎనిమిది విడతల పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేసింది.
నేడు ఐదో విడత పోలింగ్
పశ్చిమ బెంగాల్ ఐదో విడత అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఆరు జిల్లాల్లో విస్తరించిన 45 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో 39 మంది మహిళలు సహా మొత్తం 319 అభ్యర్థిలో బరిలో ఉన్నారు. ఈ స్థానాల్లో బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా పోటీ పడుతున్నది. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీకి టీఎంసీ ఎక్కువ ఓటు షేరింగ్ లభించింది. జల్‌పైగురి, కాలింపొంగ్, డార్లిలింగ్, నదియా, నార్త్ 24 పరగణాలు, పుర్బా బర్దమన్ జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.