డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల ఆధారంగా ముందుకెళ్లాను: రమేష్ కుమార్

by srinivas |   ( Updated:2020-03-17 02:13:59.0  )
Ramesh
X

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ఆధారంగా ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేశానని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ రాసిన లేఖకు రమేష్ కుమార్ మూడు పేజీల లేఖ ద్వారా సమాధానమిస్తూ, తాను గవర్నర్ వద్ద ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పని చేశానని చెప్పారు. ఎన్నికలు జరుపకపోయినా కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోవచ్చని తెలిపారు. కరోనా కారణంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్‌లలో ఉపఎన్నికలు కూడా వాయిద పడ్డాయని ఆయన వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీని ఫోన్ ద్వారా పలు మార్లు సంప్రదించానని, అయితే వైద్య పరంగా తనకు ఎలాంటి సమాచారం లేదా నివేదిక ఇవ్వలేదని, అందుకే ఎన్నికలను వాయిదా వేశానని ఆయన స్పష్టం చేశారు. తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తనను బాధించాయని ఆయన పేర్కొన్నారు.

Tags: nimmagadda ramesh kumar, election commission, cs, ec, ap

Advertisement

Next Story

Most Viewed