- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అసలు టీఎన్జీఓ సభలో ఏం జరిగింది..? నివేదిక కోరిన ఈసీ
దిశ, తెలంగాణ బ్యూరో : సాగర్ ఉప ఎన్నికల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) బుధవారం నిర్వహించిన సమావేశం వివాదస్పదమైంది. సాగర్‌లోని టూరిజం పరిధిలోని విజయ్ విహార్ హోటల్లో టీఎన్జీఓ జిల్లా కమిటీ సమావేశంతో పాటుగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించారు. అయితే సాగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ వివరాలడిగింది. కాగా ఈ సమావేశం సందర్భంగా ఉద్యోగులు పటాకులు కాల్చడం, ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏం చేశారు..?
సాగర్‌లోని విజయ్ విహార్ హోటల్లో టీఎన్జీలో నిర్వహించిన సమావేశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని నల్గొండ కలెక్టర్, సాగర్ఉప ఎన్నికల రిటర్నింగ్అధికారికి ఈసీ గురువారం ఆదేశాలు జారీ చేసింది. టీఎన్జీఓల సమావేశం నుంచి ప్రసంగాల వరకు పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలోపై కాంగ్రెస్ బుధవారమే కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ సజ్జన్ సింగ్చౌహాన్కు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఈసీ నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
కాంగ్రెస్ ఫిర్యాదు ఏంటంటే..?
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫిర్యాదులో పలు అంశాలను వివరించింది. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ ఫిర్యాదు చేశారు. సాగర్‌లోని ప్రభుత్వ అతిధి గృహంలో టీఎన్జీవో నాయకులంతా వచ్చి సమావేశం ఏర్పాటు చేశారని, పీఆర్సీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభ నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఎన్జీవో నేతలు సీఎం సూచనలతోనే సాగర్‌కు వచ్చారని, ప్రభుత్వ ఉద్యోగులను సమీకరించి, టీఆర్ఎస్ మద్దతుగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల్లోనే ఈసీ పూర్తిస్థాయి నివేదిక కోరింది.
మాది జిల్లా మీటింగ్
ఇక సాగర్ సమావేశాన్ని టీఎన్జీఓ జిల్లా కమిటీ సమావేశమని టీఎన్జీఓ పేర్కొంది. పీఆర్సీ ప్రకటన తర్వాత జిల్లా స్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని, దీనిలో ప్రభుత్వానికి కృతజ్ఞతా తీర్మానంతో పాటుగా యూనియన్, ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకుంటున్నామని తెలిపింది. ఇప్పటికే జనగామ, వరంగల్, మెదక్‌తో పాటు పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించుకున్నామని టీఎన్జీఓ వెల్లడిస్తోంది. నల్గొండ సమావేశాన్ని ఈసారి సాగర్‌లోని విజయ్‌విహార్‌లో నిర్వహించుకున్నామని, అంతకానీ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం కాదని టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ స్పష్టం చేశారు. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా 30 శాతం పీఆర్సీ అమలుపై ఉద్యోగవర్గాలు ఆనందంగా ఉన్నారని, రాష్ట్ర కమిటీ వస్తే డ్యాన్సులు, ర్యాలీతో స్వాగతం పలికారని, టపాసులు కాల్చారన్నారు. అంతేకానీ సాగర్ ఉప ఎన్నికలు, టీఎన్జీఓ జిల్లా కమిటీ సమావేశానికి సంబంధం లేదంటూ కొట్టిపారేశారు.