20 నిమిషాల్లో తిని.. రూ. 20 వేలు గెలుచుకోండి

by Shyam |   ( Updated:2021-09-30 08:17:41.0  )
offer
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఫుడ్ చాలెంజెస్ విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో ఇండియాలోనూ వాటికి ఆదరణ పెరుగుతోంది. పుణెలోని ఓ రెస్టారెంట్ యజమాని.. 60 నిమిషాల్లో బుల్లెట్ థాలీ తిని బుల్లెట్ గెలుచుకోమని ఆహార ప్రియులకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఓ రోడ్‌ సైడ్‌ పుడ్‌ స్టాల్‌ యజమాని సైతం భోజన ప్రియులకు ఇలాంటి చాలెంజ్‌ విసిరాడు. బిగ్గెస్ట్ కాథీ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని రూ. 20 వేలు గెలుచుకోండని పిలుపునిచ్చాడు.

ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్‌ స్టాల్‌ యజమాని 30 కోడిగుడ్లు, పిండితో కలిపి దాదాపు10 కేజీల బరువుండే బిగ్గెస్ట్ కాథీ రోల్‌ను తయారుచేశాడు. ఈ చాలెంజ్ ప్రత్యేకంగా ఉండటానికి కాథీ రోల్ పరిమాణమే కారణం. దీన్ని ఓ వ్యక్తి వేగంగా తినడం అంతా ఆషామాషీ కాదు. అందులోనూ కేవలం 20 నిమిషాల్లో 10 కేజీల ఆహారం తినడమంటే మామూలు విషయం కాదు. అందుకే ఫుడ్ స్టోర్ యజమాని 20 నిమిషాల్లో తిని, రూ. 20 వేలు తీసుకుపొమ్మని ధైర్యంగా సవాల్ చేశాడు.

ఈ ప్రత్యేకమైన కాథీ రోల్-ఈటింగ్ చాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫుడ్ బ్లాగింగ్ పేజీ ‘ది ఫుడ్ కల్ట్’ ద్వారా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రోల్ చాలెంజ్ వీడియోను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు, 9,44,000 మందికి పైగా ఈ వీడియోను చూడగా, ఎంతోమంది నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed