- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతకు మించి.. ఈటల మాస్టర్ ప్లాన్.. కేసీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్.!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కోయాలి అన్న నానుడితో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తనకు అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న సంకల్పంతో వేస్తున్న వ్యూహానికి చెక్ పెడుతూ ముందుకు సాగుతున్నారు.
రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంటూ తన పట్టు జారకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థి ఎంపికలో చతరుత ప్రదర్శించారు. నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 22,500 మంది ఉన్నారు.
ఆయా సామాజిక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుకూలతకు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కున చేర్చుకుంటే విజయ తీరాలకు చేరుకుంటామని అంచనా వేశారు. ఇందులో భాగంగానే ఉద్యమకారుడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో యాదవుల ఓట్లను జాక్ పాట్‌లా కొట్టేద్దామని గులాబీ బాస్ అంచనా వేశారు.
అక్కడి నుంచే ఈటల స్కెచ్..
ఇదే విషయాన్ని గమనించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా తన దృష్టిని యాదవులపై సారించారు. గ్రామాల వారీగా ఉన్న యాదవ సామాజిక వర్గాల వారితో టచ్‌లో ఉండేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే గొల్లగూడాన్ని సందర్శించి అక్కడి యాదవులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని యాదవులందరితో డైరెక్ట్ ములాఖత్ కావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. యాదవులను తనకు అనుకూలంగా మల్చుకునే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు.
దీనివల్ల కేసీఆర్ వేసిన కీలక నిర్ణయానికే చెక్ పెట్టినట్టవుతుందని అంచనా వేస్తున్నారు. యాదవుల ఓట్లలో ఎంత చీలిక తెస్తే అంత తనకు లాభించడమే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యానికి భారీగా గండి కొట్టినట్టవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రభావం ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లపై పడటం వల్ల టీఆర్ఎస్ మరింత నష్టపోతుందని అనుకుంటున్నారు. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమతో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.