- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు ఆ మూడు లేవు.. ఇచ్చినవి తీసుకోండి: ఈటల
దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో 8వ రోజు శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్ పల్లి, ఉప్పల్, ఉప్పలపల్లి గ్రామాల్లో ఈటల ప్రజాదీవెన యాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా అన్ని గ్రామాల నుంచి రాజేందర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం కేసీఆర్ దళిత బంధు పథకంతో నయా డ్రామాకు తెరలేపారని విమర్శించారు. 18 సంవత్సరాలు కలిసి పనిచేసిన తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన కేసీఆర్‌కు నీతి, జాతి, మానవత్వం లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలు తన పని తీరును చూసి ప్రశంసిస్తే ఆ ఆదరణ చూసి ఓర్వలేకనే కేసీఆర్ కుట్రలు పన్నారని ఈటల ఆరోపించారు. తనతో పని చేసే అభిమానులను పాత కేసులను చూపిస్తూ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తన గెలుపుతో విప్లవం వస్తుందని ఈటల వ్యాఖ్యానించారు. తన రాజీనామాతోనే హుజురాబాద్ ప్రజలకు అదృష్టం వచ్చిందని.. తద్వారానే గొర్రెల పంపిణీ, రేషన్ కార్డులు, పెన్షన్లు, కొత్తగా దళిత బంధు కార్యక్రమం చేపట్టారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను తీసుకొని.. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలింపించాలని ఈటల అభ్యర్థించారు.