వాళ్లు నన్ను‘ రాజేందర్ మాదిగ’ అని పిలిచేవారు : ఈటల షాకింగ్ కామెంట్స్

by Sridhar Babu |   ( Updated:2021-07-29 06:17:50.0  )
Eatala-Rajender
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నన్ను ఓడించడానికి నీచపు రాజకీయాలు చేస్తున్నాడని, ఇకనైనా ఆయన అలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్‌ను ఘాటుగా విమర్శించారు.

నన్ను ఓడగొట్టే దమ్ము లేక కొన్ని టీవి చానళ్లను అడ్డం పెట్టుకొని కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. నేను మాదిగల మీటింగ్‌కు పోతే కొందరు నన్ను రాజేందర్ మాదిగ అని పిలిచేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం దళితులు నా కాళ్లు కడుగుతా అని వస్తే.. నేను ముందు వాళ్ల కాళ్లు మొక్కి.. తర్వాత కాళ్లు కడిగించుకున్నానని అన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను విమర్శిస్తారని నాకు ముందే తెలుసని తెలిపారు. అందుకే నేను వాళ్ల కాళ్లు మొక్కినట్టు చెప్పుకొచ్చారు.

దళిత బిడ్డలకు విజ్ఞానం నేర్పించిన దళిత ఐపీఎస్ అధికారి RS ప్రవీణ్ కుమార్‌ను కావాలనే ఉద్యోగానికి రాజీనామా చేసేలా కుట్ర పన్నారని, ఆయన కేసీఆర్ కుట్రలు భరించలేకనే ఉద్యోగాన్ని వదులుకున్నాడని అన్నారు. నా రాజీనామా తర్వాతనే కేసీఆర్ దళితులకు గౌరవం ఇస్తూ వస్తున్నాడని పేర్కొన్నారు. నా బావమరిది దళితులను ఏమన్నాడో అని టీ న్యూస్‌లో పొద్దు మాపు వేస్తున్నాడని, తలకాయ కిందకు.. కాళ్ళు మీదకు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కేసీఆర్‌ను బొంద పెట్టడం ఖాయమని గట్టిగా నొక్కి చెప్పారు. నా రాజకీయ వ్యవస్థను కేసీఆర్ బోన్‌లో నిలబెట్టాడని, ఇంత కన్నా మెరుగైన పాలనను బీజేపీ అందిస్తుందని, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 20 సంవత్సరాలుగా బీజేపీ పాలిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

‘దిశ’ కథనానికి స్పందన.. థ్యాంక్స్ చెప్పిన TRS నేతలు, కార్యకర్తలు

Advertisement

Next Story

Most Viewed