- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను మీ బిడ్డను.. నన్ను కాపాడుకోండి : ఈటల రాజేందర్
దిశ, జమ్మికుంట : మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి దాకా నియోజక వర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు మీరంతా నన్ను మీ బిడ్డ లాగా చూసుకొని రాబోయే ఉప ఎన్నికల్లో గెలిపించి కాపాడుకోవాలని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బుధవారం రాత్రి హుజురాబాద్ మండలం కందుగుల గ్రామ ఎస్సీ కాలనీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం అందరికీ రావాలని కొంతమందికే ఇచ్చారని ధైర్యంగా అడిగిన ప్రవళిక, పరిమళ, గౌతమి, ధనలక్ష్మిలను ఒక సమ్మక్క-సారలమ్మ, రాణి రుద్రమదేవిగా అభివర్ణించారు. తన రాజీనామా వల్లనే నియోజకవర్గంలో పింఛన్ల నుంచి మొదలుకొని దళిత బంధు వరకు అన్నీ ప్రభుత్వమే అందజేస్తుందని అన్నారు.
అయితే, దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని ఇతర నియోజక వర్గాలకు చెందిన వారు ఇక్కడ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంతకంటే ఎక్కువ పనులు వారి నియోజకవర్గంలో చేశారా.? అని.. ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.