- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2 గుంటలున్న వ్యక్తి.. 250 కోట్ల దావత్ ఇచ్చాడా : ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వీణవంక : మండలంలోని మల్లన్నపల్లి గ్రామంలో శనివారం మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ అధ్యక్షుడు భూపతిరెడ్డి, యాదవ సంఘం అధ్యక్షుడు దేవేందర్ ఈటల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.. ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే నీకు ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ దొరికింది, పదవి రాబోతుందని అన్నారు.
ఏం హోదా ఉందని కౌశిక్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మహిళలు అంటున్నారు. గొర్ల మందల మీద తోడేళ్లు దాడి చేసినట్టు, పంట పొలాల మీద మిడతలు దాడి చేసినట్టు.. నేను ఏం పాపం చేశానని దాడి చేస్తున్నారు. ఇక్కడ తిరిగే నాయకుల్లారా మీరు వీణవంక వాగు దగ్గరకి వచ్చి మాట్లాడండి.. కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడకండి అని అన్నారు.
మిస్టర్ సీఎం.. తెలంగాణ నీ అబ్బా జాగిరు కాదు. బీజేపీలో ఉన్నవారికి దళిత బంధు ఇవ్వను అంటున్నారట ఎలా ఇవ్వవో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. డబ్బు కోసం లొంగిపోయేవాడు లొంగి పోతున్నాడు.. ఆత్మగౌరవం కోసం కొట్లాడేవారు నాతో ఉంటున్నారని తెలిపారు. రెండు గుంటలు ఉన్నవాడు 250 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టాడు. ఎలా ఇన్ని దావత్‌లు ఇస్తున్నాడని ప్రశ్నించారు. నా పోటీ ఆయనతో కాదు కేసీఆర్‌తోనని అన్నారు. నా ఇంటికి ఎవరన్నా వస్తే నీ పార్టీ ఏంది.? నీ కులం ఏంటి.. అని ఎప్పుడూ అడుగలేదు. నీ బాధ ఏంది అని అడిగి.. అన్నం పెట్టి, సాయం చేసి పంపాను అని పేర్కొన్నారు.