ఈటలను డైలామాలో పడేస్తున్న కేడర్…

by Sridhar Babu |
ఈటలను డైలామాలో పడేస్తున్న కేడర్…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి వర్గం నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గ కేడర్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. హుజురాబాద్ ప్రజలతో మాట్లాడి ఓ నిర్ణయానికి వద్దామనకున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకుల ఓపినియన్ ఆయనను డైలమాలో పడేస్తోంది. దీంతో ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది.

వద్దు సార్..

రాజీనామా చేసి ప్రత్యక్ష్య పోరాటానికి దిగకండి సర్ దాని వల్ల మీకే నష్టం వాటిల్లుతుందని కొందరు నాయకులు చెప్తున్నారు. రాజీనామా చేసిన తరువాత ఉప ఎన్నికలు జరిగితే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీనివల్ల ఓటమి చవి చూసే ప్రమాదం కూడా లేకపోలేదని కొంతమంది నాయకులు అంటున్నారు. అవసరమైతే అధిష్టానం వద్దకు తామంతా వెళ్లి మీ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరుతామని కూడా సెకండ్ కేడర్ ఈటలతో చెప్తోంది. పార్టీకి రాజీనామా చేసిన వెంటనే అధిష్టానం ఎత్తులకు ఈటల చిత్తు కావల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీని వీడాల్సిందే…

మరో వైపున టీఆర్ఎస్ పార్టీని వీడి ప్రత్యక్ష్య పోరాటం చేయాల్సిందేనన్న అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత దూరం వచ్చాక పార్టీని అట్టిపెట్టుకుని ఉండడం సమంజసం కాదని అంటున్నవారూ లేకపోలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష్య పోరాటం చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కూడా అసమ్మతి ఉందని వారందరిని ఒకే చోటకు చేర్చి తిరుగుబావుటా ఎగురేయాలని, అప్పుడే ఈటల పవర్ ఏంటో తెలిసొస్తుందంటున్నారు హుజురాబాద్ నాయకులు.

ఆయన నిర్ణయమై పైనల్…

క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఈ అభిప్రాయ సేకరణ ఎలా ఉన్నా ఈటల తన మదిలో తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని అనుకుంటున్నారు. ఏ పార్టీలో చేరినా, సొంత పార్టీ పెట్టినా, టీఆర్ఎస్‌లో ఉన్నా ఆయన తీసుకునే డెసిషన్ పై నే అధారపడి ఉంటుందంటున్నారు.

Advertisement

Next Story