- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల రాజేందర్ బకరా –2 : జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ తెలంగాణ నాయకులు డమ్మీలని, బండి సంజయ్ బకరా నెం 1, ఈటల రాజేందర్ బకరా నెం 2 అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి సంజయ్ బలికాక తప్పదని, ఢిల్లీ నుంచి ఏడేళ్లుగా ఎన్ని నిధులు తెచ్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారం కాపాడుకోవడానికే బీజేపీతో దోస్తీ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదని, పవర్ అంతా ఢిల్లీ చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ గల్లీలో కేసీఆర్‌ను తిడుతున్నాడని, ఢిల్లీలో బీజేపీ నేతలతో కేసీఆర్ తిరుగుతున్నాడని, కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి సంజయ్ బలికాక తప్పదని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
కలెక్టర్లు ఉన్నారా..?
రాష్ట్రం మొత్తం వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం కేసీఆర్ఢిల్లీలో తిరుగుతున్నాడని జగ్గారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం లేడని, కలెక్టర్లు కూడా లేరని అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో కలెక్టర్లు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కలెక్టర్లు దొరకడం లేదని ఆరోపించారు. కలెక్టర్లు కూడా ఫాంహౌస్‌కు పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న కలెక్టర్లు ఏం పనులు చేయడం లేదని, కలెక్టరేట్లు బూతు బంగళాలుగా మారాయని దుయ్యబట్టారు.
గతంలో జీహెచ్ఎంసీలో వరదలు వచ్చినట్టు రాష్ట్రమంతా వర్షాలు వస్తున్నాయని, వర్షంతో నష్టపోయిన వారికి రూ.10వేలు ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్‌చేశారు. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడే ఏం మాట్లాడుతారో ఆయనకే తెల్వదని, ఇద్దరం దోస్తులమేనని, కానీ రాజాసింగ్‌కు బీజేపీలో విలువ లేదన్నారు.
కాగా కాంగ్రెస్‌లో విభేదాలు కుటుంబ సభ్యుల పంచాయతీ వంటిదని, కాంగ్రెస్‌లో ఫిర్యాదులు కామన్ అని అన్నారు. సీతక్క ఆవేశంలో మాట్లాడారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని జగ్గారెడ్డి వెల్లడించారు.