- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం.. వణికిపోయిన ప్రజలు
దిశ, వెబ్‌డెస్క్ :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొముర్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, బెజ్జూర్, సుల్గుపల్లి గ్రామాల్లో భూమి స్పల్పంగా కంపించింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడం తో జనం పరుగులు తీశారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల 49 నిమిషాలకు మూడు సెకన్ల పాటు భూమి కంపిచడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు పరుగులు తీశారు.
జిల్లాలోని అప్పన్నపేట, ముత్తారం మండలంలోని హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్, గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ, అశోక్ నగర్, గాంధీ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. అలాగే పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని వెన్నంపల్లి గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోనూ భూమి కంపించినట్టు తెలిసింది. అహేహరి తాలుకా కేంద్రంతో పాటు ఆల్లపల్లిలో స్వల్పంగా భూమి కంపించినట్టు సమాచారం. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.