తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ పరీక్ష.. ఆ నిబంధనలు తప్పనిసరి

by Anukaran |
తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ పరీక్ష.. ఆ నిబంధనలు తప్పనిసరి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గం.నుంచిల మ.12గం. వరకు అలాగే మ.3 నుంచి సా.6 గం. వరకు పరీక్ష కొనసాగనున్నాయి. 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్. 9,10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల సమయంలో తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. నిబంధనలలో భాగంగా విద్యార్థులు శానిటైజర్, మాస్క్, తప్పని సరి ధరించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆరోగ్య వివరాలను వెల్లడించాలన్నారు.

అదే విధంగా కొవిడ్ బారిన పడిన విద్యార్థులకు సెషన్స్ అన్నీ పూర్తయ్యాక పరీక్ష నిర్వహిస్తామన్నారు. బిట్ శాట్ రాస్తున్న 1500 మందికి ఎంసెట్ పరీక్ష సమయం రీషెడ్యూల్ చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు. ఈసారి 2లక్షల 51 వేల 6 వందల 6 మంది ఎంసెట్‌కు దరఖాస్తు చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ కు అనుగుణంగా ప్రశ్నాపత్రాలను అందించనున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల రూట్ మ్యాప్ ను హాల్ టిక్కెట్ పై ముద్రించారు.

Advertisement

Next Story