జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్ష

by Shyam |   ( Updated:2021-03-06 07:44:13.0  )
జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూలై 5 నుంచి 9 వరకూ టీఎస్ ఎంసెట్-2021 పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ప్రొఫెషన్ కోర్సులకు ఉన్నత విద్యామండలి పరిధిలో ఎంసెట్-2021ని నిర్వహించే బాధ్యత ఈ ఏడాది జేఎన్‌టీయూకు అప్పగించారు.

ఎంసెట్ కమిటీ సమావేశం ఈ నెల 6న నిర్వహించి ఫీజు స్ట్రక్చర్, తుది షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుండగా.. 20వ తేదీ నుంచి మే 18 వరకూ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. గడువు ముగిసిన తర్వాత రూ.250 ఫైన్‌తో మే 28 వరకూ రూ.2,500 అపరాధ రుసుంతో జూన్ 6వ తేదీ వరకూ, రూ.5వేల ఫైన్‌తో జూన్ 28 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల ఎంసెట్ పరీక్షను జూలై 5,6 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. ఇంజనీరింగ్ పరీక్షను 7 నుంచి 9వ తేదీ వరకూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహిస్తారు. ఎంసెట్ పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.400, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు.

Advertisement

Next Story