ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల..

by Shyam |   ( Updated:2020-10-24 05:02:54.0  )
ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు విడుదలయ్యాయి.శనివారం మధ్యాహ్నం సమయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలకు 63,857 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవ్వగా, 59,113మంది క్వాలిఫై అయ్యారని చైర్మన్ వెల్లడించారు. రిజల్ట్స్ కోసం eamcet.tsche.ac.inను సంప్రదించాలని కోరారు.

కాగా, ఈనెల 6న ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అలాగే ఈనెల 28న ఎడ్‌సెట్, నవంబర్ 2న ఐసెట్, 6న లాసెట్ ఫలితాలు విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story